లంచమివ్వలేదని పాత్రికేయుడి తల్లి స‌జీవ ద‌హ‌నం

ఉత్తరప్రదేశ్ పోలీసులు మానవత్వం మరిచిపోయి మరోసారి అమానుషంగా ప్రవర్తించారు. భర్తను విడిపించుకునేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన పాత్రికేయుడి తల్లిపై అడిగినంత లంచం ఇవ్వలేదన్న ఆగ్రహంతో పెట్రోలు పోసి నిప్పంటించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించింది. ఈ సంఘటన బారాబంకీ జిల్లాలోని కోథీలో జరిగింది. జితేంద్రసింగ్‌ అనే జర్పలిస్టును ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సజీవదహనం చేసిన ఘటనను దేశప్రజలు ఇంకా మరవకముందే మ‌ళ్ళీ ఈ దారుణానికి తెగబడ్డారు. ఓ హిందీ దినపత్రికలో […]

Advertisement
Update:2015-07-08 09:46 IST
ఉత్తరప్రదేశ్ పోలీసులు మానవత్వం మరిచిపోయి మరోసారి అమానుషంగా ప్రవర్తించారు. భర్తను విడిపించుకునేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన పాత్రికేయుడి తల్లిపై అడిగినంత లంచం ఇవ్వలేదన్న ఆగ్రహంతో పెట్రోలు పోసి నిప్పంటించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించింది. ఈ సంఘటన బారాబంకీ జిల్లాలోని కోథీలో జరిగింది. జితేంద్రసింగ్‌ అనే జర్పలిస్టును ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సజీవదహనం చేసిన ఘటనను దేశప్రజలు ఇంకా మరవకముందే మ‌ళ్ళీ ఈ దారుణానికి తెగబడ్డారు. ఓ హిందీ దినపత్రికలో ప‌ని చేస్తున్న‌ పాత్రికేయుడు సంతోష్ తండ్రిని ఈవ్ టీజింగ్ కేసులో విచారించాలని పోలీసులు శనివారం స్టేషన్‌కు తీసుకువెళ్లారు. భర్తను విడిపించుకునేందుకు స్టేషన్‌కు వెళ్లిన సంతోష్ తల్లి నీతూను రూ.లక్ష ఇవ్వాలని పోలీసులు డిమాండు చేశారు. అందుకు ఆమె నిరాకరించడంతో అవమానించి స్టేషన్‌ నుంచి గెంటేశారు. అంతటితో ఆగకుండా ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించారు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు వారి దాష్టీకంపై జడ్జి, మీడియా ముందు వాంగ్మూలమిచ్చారు. స్టేషన్‌ ఇన్‌చార్జి రామ్ సాహెబ్‌ యాదవ్‌, ఎస్‌ఐ అఖిలేశ్‌ రాయ్‌లు అందరూ చూస్తుండగానే తనపై పెట్రోలు పోసి అగ్గిపుల్లతో నిప్పంటించారని, అందరూ చోద్యం చూస్తూ నిలబడ్డారే తప్ప తనకు సహాయం చేయలేదని ఆమె చెప్పారు. కాగా బాధితురాలే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. తన తండ్రిని అక్రమంగా నిర్భంధించడంతోపాటు తల్లిని హత్య చేసిన పోలీసు అధికారులపై హత్యానేరం మోపి అరెస్ట్‌ చేయాలని జర్నలిస్ట్‌ సంతోష్ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ఉదంతంపై నిజానిజాలను విచారించేందుకు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించామని ముఖ్యమంత్రి అఖిలేశ్‌ ప్రకటించారు.

 

Tags:    
Advertisement

Similar News