అఖిల్ సినిమా దాదాపు పూర్తి
హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం కష్టపడుతున్న అక్కినేని అఖిల్, తన డెబ్యూ మూవీని దాదాపు కంప్లీట్ చేశాడు. చాలా భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా థాయ్ లాండ్ షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుంది. దీంతో సినిమా షూటింగ్ దాదాపు 80శాతం పూర్తయింది. మిగిలిన 20శాతం టాకీపార్ట్ తో పాటు మరో 2 పాటల్ని హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోస్ లోనే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. […]
Advertisement
హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం కష్టపడుతున్న అక్కినేని అఖిల్, తన డెబ్యూ మూవీని దాదాపు కంప్లీట్ చేశాడు. చాలా భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా థాయ్ లాండ్ షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుంది. దీంతో సినిమా షూటింగ్ దాదాపు 80శాతం పూర్తయింది. మిగిలిన 20శాతం టాకీపార్ట్ తో పాటు మరో 2 పాటల్ని హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోస్ లోనే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. వీవీ వినాయక్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈ నెలాఖరుకు సినిమా పేరును అట్టహాసంగా విడుదలచేసే ఆలోచనలో ఉన్నారు. అప్పటికి సినిమా షూటింగ్ 90శాతం పూర్తిచేయాలనే టార్గెట్ పెట్టుకుంది యూనిట్. అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరాకు అఖిల్ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉంది. అటు నాగార్జున మాత్ర సినిమా పక్కాగా సిద్ధమైన తర్వాతే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేద్దామని ఇప్పటికే యూనిట్ కు సూచించాడు. అఖిల్ సినిమాను నాగ్ తో పాటు మరో హీరో నితిన్ కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు అనూప్ రూబెన్స్ తో పాటు తమన్ కూడా సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.
Advertisement