ఆళ్ళగడ్డ జైల్లో భూమా నిరశనదీక్ష
పోలీసు అధికారులను నిందించిన కేసులో అరెస్టయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని కోర్టులో హాజరు పరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ సబ్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఈనేపథ్యంలో ఆయన్ని చికిత్స కోసం నిమ్స్‌కు తరలించాలని ప్రభుత్వ వైద్యులు సూచించారు. దీనికి జైలు అధికారుల సరిగా స్పందించకపోవడంతో భూమా జైలులోనే నిరాహారదీక్షకు దిగారు. ఆయన […]
Advertisement
పోలీసు అధికారులను నిందించిన కేసులో అరెస్టయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని కోర్టులో హాజరు పరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ సబ్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఈనేపథ్యంలో ఆయన్ని చికిత్స కోసం నిమ్స్‌కు తరలించాలని ప్రభుత్వ వైద్యులు సూచించారు. దీనికి జైలు అధికారుల సరిగా స్పందించకపోవడంతో భూమా జైలులోనే నిరాహారదీక్షకు దిగారు. ఆయన జైలులో ఏర్పాటు చేసిన అల్పాహారం తీసుకోలేదు. మందులను వేసుకోలేదు. తనను నిమ్స్‌కు తరలించడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేయకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి తరలించే వరకు తాను ఆహారం తీసుకోనని, మందులు వేసుకోనని ఆయన భీష్మించారు. జైలు అధికారులు బతిమాలినా ఆయన ససేమిరా అన్నారు.
Advertisement