మూడో షెడ్యూల్ లోకి నాగ్-కార్తి సినిమా

నాగార్జున-కార్తి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా మూడో షెడ్యూల్ లోకి ఎంటరైంది. ఇప్పటికే చెన్నైలో మొదటి షెడ్యూల్ 20రోజుల పాటు షూట్ చేశారు. తర్వాత రెండో షెడ్యూల్ ను అన్నపూర్ణ స్టుడియోస్ లో ప్రారంభించి మరో 25 రోజులు షూట్ చేశారు. ఇప్పుడు కీలకమైన మూడో షెడ్యూల్ లోకి ఎంటరైంది నాగ్-కార్తి సినిమా. ఈ సినిమా మూడో షెడ్యూల్ ను యూరోప్ లో ప్లాన్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ […]

Advertisement
Update:2015-07-02 00:34 IST
నాగార్జున-కార్తి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా మూడో షెడ్యూల్ లోకి ఎంటరైంది. ఇప్పటికే చెన్నైలో మొదటి షెడ్యూల్ 20రోజుల పాటు షూట్ చేశారు. తర్వాత రెండో షెడ్యూల్ ను అన్నపూర్ణ స్టుడియోస్ లో ప్రారంభించి మరో 25 రోజులు షూట్ చేశారు. ఇప్పుడు కీలకమైన మూడో షెడ్యూల్ లోకి ఎంటరైంది నాగ్-కార్తి సినిమా. ఈ సినిమా మూడో షెడ్యూల్ ను యూరోప్ లో ప్లాన్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ లో నాగ్-కార్తి సినిమాను షూట్ చేయాలని నిర్ణయించారు. కేవలం పాటల కోసం కాకుండా.. కొన్ని ఫైటింగ్ సీన్లు కూడా సెర్బియాలో చిత్రీకరిస్తారు. ఇక సినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన కార్ ఛేజ్ ను ప్యారిస్ నగర వీధుల్లో తీయాలని నిర్ణయించారు. భారీ బడ్జెట్ తో పీవీపీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో ఇదే సినిమా కోసం శృతిహాసన్ ను తీసుకొని తర్వాత ఆ స్థానంలో తమన్నాను ఎంపికచేశారు.
Tags:    
Advertisement

Similar News