పిచ్చెక్కిస్తున్న రామ్ చరణ్
శ్రీనువైట్ల సినిమా కోసం ఆ మధ్య చెర్రీ బ్యాంకాక్ వెళ్లాడనే విషయం అందరికీ తెలిసిందే. బ్యాంకాక్ వెళ్లి కొన్ని ఫైటింగ్స్ నేర్చుకున్నాడనే విషయాన్ని సినిమా యూనిట్ కూడా కన్ ఫర్మ్ చేసింది. అయితే అదే సమయంలో ఫైట్స్ తో పాటు విదేశీ డాన్స్ మాస్టర్ల దగ్గర కొన్ని డాన్స్ మూమెంట్స్ కూడా చెర్రీ నేర్చుకున్నాడనే వార్తలొచ్చాయి. ఆ వార్తలు ఇన్నాళ్లకు నిజమయ్యాయి. సినిమాలో రామ్ చరణ్ తన స్టెప్పులతో అదరగొడుతున్నాడు. విదేశీ డాన్స్ మాస్టర్ల దగ్గర నేర్చుకున్న […]
Advertisement
శ్రీనువైట్ల సినిమా కోసం ఆ మధ్య చెర్రీ బ్యాంకాక్ వెళ్లాడనే విషయం అందరికీ తెలిసిందే. బ్యాంకాక్ వెళ్లి కొన్ని ఫైటింగ్స్ నేర్చుకున్నాడనే విషయాన్ని సినిమా యూనిట్ కూడా కన్ ఫర్మ్ చేసింది. అయితే అదే సమయంలో ఫైట్స్ తో పాటు విదేశీ డాన్స్ మాస్టర్ల దగ్గర కొన్ని డాన్స్ మూమెంట్స్ కూడా చెర్రీ నేర్చుకున్నాడనే వార్తలొచ్చాయి. ఆ వార్తలు ఇన్నాళ్లకు నిజమయ్యాయి. సినిమాలో రామ్ చరణ్ తన స్టెప్పులతో అదరగొడుతున్నాడు. విదేశీ డాన్స్ మాస్టర్ల దగ్గర నేర్చుకున్న మూమెంట్స్ అన్నింటినీ తన సినిమాలోని ట్యూన్స్ కు తగ్గట్టు ప్రజెంట్ చేస్తున్నాడు. ప్రస్తుతం చెర్రీ కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఓవైపు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో కొన్ని ఫైట్ సీన్లు తీస్తూనే.. మరోవైపు అన్నపూర్ణ స్టుడియోలో పాటల షూటింగ్ కూడా కానిచ్చేస్తున్నారు. ఈ పాటల్లోనే చరణ్ తన డాన్స్ ప్రతిభను చూపిస్తున్నాడు. చెర్రీతో డాన్స్ చేయలేక రకుల్ ప్రీత్ సింగ్ 2-3 టేక్స్ ఎక్కువ తీసుకుంటోందట. ఈ విషయాలన్నీ రకుల్ ప్రీత్ సింగే చెప్పుకొచ్చింది. సో.. చెర్రీ-వైట్ల సినిమాలో ఫైట్స్ తో పాటు స్టెప్పులు కూడా పిచ్చెక్కించబోతున్నాయన్నమాట. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
Advertisement