మరోసారి సింగర్ అవతారం ఎత్తింది
ఒకప్పటి అందాల తార, డ్రీమ్ గర్ల్ జయప్రద కొత్త అవతారం ఎత్తింది. తన అందచందాలతో, హావభావాలతో ఒక తరాన్ని ఉర్రూతలూగించిన ఈ సీనియర్ నటి ఇప్పుడు మైక్ పట్టుుకుంది. గాయనిగా కొత్త అవతారం ఎత్తింది. గతంలో 2-3 సినిమాల్లో పాడిన అనుభవం ఉన్నప్పటికీ ఇకపై పూర్తిస్థాయి సింగర్ గా మారబోతున్నట్టు ప్రకటించింది. తాజాగా తమిళ్ లో ఓ సినిమాలో 3 పాటలు పాడేందుకు సిద్ధమౌతోంది. వీటిలో ఒక పాటను ఈమధ్యే రికార్డింగ్ చేశారు కూడా. తెలుగులో హిట్టయిన […]
Advertisement
ఒకప్పటి అందాల తార, డ్రీమ్ గర్ల్ జయప్రద కొత్త అవతారం ఎత్తింది. తన అందచందాలతో, హావభావాలతో ఒక తరాన్ని ఉర్రూతలూగించిన ఈ సీనియర్ నటి ఇప్పుడు మైక్ పట్టుుకుంది. గాయనిగా కొత్త అవతారం ఎత్తింది. గతంలో 2-3 సినిమాల్లో పాడిన అనుభవం ఉన్నప్పటికీ ఇకపై పూర్తిస్థాయి సింగర్ గా మారబోతున్నట్టు ప్రకటించింది. తాజాగా తమిళ్ లో ఓ సినిమాలో 3 పాటలు పాడేందుకు సిద్ధమౌతోంది. వీటిలో ఒక పాటను ఈమధ్యే రికార్డింగ్ చేశారు కూడా. తెలుగులో హిట్టయిన ఇష్క్ సినిమా తమిళ్ లో ఉయిరే..ఉయిరే పేరుతో రీమేక్ అవుతోంది. జయప్రద మేనల్లుడు సిద్దార్థ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులోనే జయప్రద మూడు పాటలు పాడేందుకు సిద్ధమౌతోంది. ముందురోజు రాత్రంతా ప్రాక్టీస్ చేసిన జయప్రద, మరుసటి రోజు స్టుడియోకు వెళ్లి పాట పాడేశారు. అన్నట్టు ఈ సినిమాకు జయప్రద సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.
Advertisement