సల్మాన్ పెయింటింగ్ కరీనా ఇంటికి

సల్మాన్ ఖాన్ సూపర్ స్టార్ మాత్రమే కాదు.. మంచి పెయింటర్ కూడా. ఇప్పటికే పలు చిత్రాలు గీసిన సల్మాన్ తాజాగా కూడా ఓ మంచి బొమ్మ గీశాడు. ఆ బొమ్మను ట్విట్టర్ లో కూడా పెట్టాడు. భజరంగీ భాయ్ జాన్ స్ఫూర్తితో గీసిన ఆ చిత్రానికి నెట్ లో విశేష స్పందన వచ్చింది. సల్మాన్ టాలెంట్ ను యావత్ లోకం మెచ్చుకుంది. ఆ మెచ్చుకున్న వాళ్ల లిస్ట్ లో కరీనా కపూర్ కూడాా ఉంది. సల్మాన్ అద్భుతంగా […]

Advertisement
Update:2015-06-27 03:38 IST

సల్మాన్ ఖాన్ సూపర్ స్టార్ మాత్రమే కాదు.. మంచి పెయింటర్ కూడా. ఇప్పటికే పలు చిత్రాలు గీసిన సల్మాన్ తాజాగా కూడా ఓ మంచి బొమ్మ గీశాడు. ఆ బొమ్మను ట్విట్టర్ లో కూడా పెట్టాడు. భజరంగీ భాయ్ జాన్ స్ఫూర్తితో గీసిన ఆ చిత్రానికి నెట్ లో విశేష స్పందన వచ్చింది. సల్మాన్ టాలెంట్ ను యావత్ లోకం మెచ్చుకుంది. ఆ మెచ్చుకున్న వాళ్ల లిస్ట్ లో కరీనా కపూర్ కూడాా ఉంది. సల్మాన్ అద్భుతంగా పెయింటింగ్ వేశాడంటూ మెచ్చుకుంది కరీనా. తన చూసిన ది బెస్ట్ పెయింటర్స్ లో సల్మాన్ ఒకడంటూ కితాబిచ్చింది. కరీనా కితాబుతో పొంగిపోయిన సల్మాన్, తన గీసిన ఆ పెయింటింగ్ ను ఆమెకే గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్యాక్ చేసి మరీ ఆమె ఇంటికి పంపించాడు. గతంలో కరీనాకు ఇలానే ఖరీదైన కార్లు, ఉంగరాలు, వాచీలు బహుమతిగా ఇచ్చాడు సల్మాన్. ఇప్పుడు తను ఎంతగానో కష్టపడి, ఇష్టపడి గీసిన పెయింటింగ్ ను కూడా ఇచ్చేశాడు. ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు కాశ్మీర్ లోయలో తను షూటింగ్ చేసిన ప్రదేశానికి దగ్గర్లో ఉన్న కుటుంబాలందరికీ ఉచితంగా కలర్ టీవీలు పంపిణీ చేశాడు సల్మాన్.

Tags:    
Advertisement

Similar News