ఎట్టకేలకు స్పందించిన రాజమౌళి

వందల కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా.. దాదాపు మూడేళ్ల కష్టం.. ఇలాంటి సినిమాకు సంబంధించి విమర్శలొస్తే తట్టుకోవడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా ఏదో సినిమాను చూసి ఇది కాపీకొట్టారంటూ వార్తలొస్తే ఇంకా కష్టం. ప్రస్తుతం అలాంటి కష్టాన్నే ఫేస్ చేశాడు రాజమౌళి. తను ఎంతో కష్టపడి తీసిన బాహుబలి సినిమాకు సంబంధించి పోస్టర్ల నుంచి నిన్నటి వరకు విడుదల చేసిన వీడియోలు, ట్రయిలర్స్ వరకు చాలావరకు కాపీ అంటూ వస్తున్న ప్రచారాన్ని జక్కన్న జీర్ణించుకోలేకపోయాడు. ఎప్పట్నుంచో […]

Advertisement
Update:2015-06-27 05:41 IST
వందల కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా.. దాదాపు మూడేళ్ల కష్టం.. ఇలాంటి సినిమాకు సంబంధించి విమర్శలొస్తే తట్టుకోవడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా ఏదో సినిమాను చూసి ఇది కాపీకొట్టారంటూ వార్తలొస్తే ఇంకా కష్టం. ప్రస్తుతం అలాంటి కష్టాన్నే ఫేస్ చేశాడు రాజమౌళి. తను ఎంతో కష్టపడి తీసిన బాహుబలి సినిమాకు సంబంధించి పోస్టర్ల నుంచి నిన్నటి వరకు విడుదల చేసిన వీడియోలు, ట్రయిలర్స్ వరకు చాలావరకు కాపీ అంటూ వస్తున్న ప్రచారాన్ని జక్కన్న జీర్ణించుకోలేకపోయాడు. ఎప్పట్నుంచో వస్తున్న ఈ విమర్శలపై ఇన్నాళ్లకు స్పందించాడు రాజమౌళి. తన మనసులో అనుకున్నది తీశానే తప్ప, ఇంగ్లిష్ సినిమాలు చూసి కాపీకొట్టలేదని స్పష్టంచేశాడు. అయినా విమర్శకులు చెబుతున్న హాలీవుడ్ సినిమాలకు, బాహుబలికి అస్సలు సంబంధం లేదన్నాడు రాజమౌళి. అంతేకాదు.. బాహుబలి స్టోరీలైన్ ను కూడా పైపైన చెప్పుకొచ్చాడు. రాజమౌళి వివరణతోనైనా బాహుబలి సినిమాకు సంబంధించి అలాంటి కాపీ వార్తలు రావడం ఆగిపోతాయేమో చూడాలి.
Tags:    
Advertisement

Similar News