నయన్ కోరిక కరక్టేనేమో ?
వెలుగు వున్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలి. ఈ సూత్రాన్ని తెలివైన హీరోయిన్స్ మ్యాగ్జిమమ్ ఆప్లై చేస్తుంటారు. హీరోయిన్ గా స్టార్ డమ్ తెచ్చుకోవడం ఆషామాషి కాదు. వచ్చిన తరువాత నిలపుకోవడం మరింత కష్టం. అలా ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ లో ఒకరు నయనతార. ఇటు తెలుగు, అటు తమిళ్ రెండు ఇండస్ట్రీలలోను స్టార్ హీరోయిన్ గా హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ లేవు. కానీ తమిళ్ లో మాత్రం అరడజను చిత్రాలు చేస్తుంది. ఈ […]
Advertisement
వెలుగు వున్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలి. ఈ సూత్రాన్ని తెలివైన హీరోయిన్స్ మ్యాగ్జిమమ్ ఆప్లై చేస్తుంటారు. హీరోయిన్ గా స్టార్ డమ్ తెచ్చుకోవడం ఆషామాషి కాదు. వచ్చిన తరువాత నిలపుకోవడం మరింత కష్టం. అలా ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ లో ఒకరు నయనతార. ఇటు తెలుగు, అటు తమిళ్ రెండు ఇండస్ట్రీలలోను స్టార్ హీరోయిన్ గా హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ లేవు. కానీ తమిళ్ లో మాత్రం అరడజను చిత్రాలు చేస్తుంది. ఈ యేడాది సంఖ్య పరంగా అన్ని చిత్రాలు చే్స్తున్న హీరోయిన్ నయనతార మాత్రమే. అంటే అక్కడ నెంబర్ వన్ హీరోయిన్ అని చెప్పడం అతిశయోక్తి కాదు.కట్ చేస్తే ప్రస్తుతం మెగాస్టార్ 150 వ సినిమాకు హీరోయిన్ హంట్ నయనతార దగ్గరకు వచ్చింది. కోర్టు లో బాల్ తన సైడ్ వుండటం కాదు..ఏకంగా తన చేతిలో ఉండటంతో.. రెమ్యునరేషన్ విషయంలో గట్టి మడత పేచి పెట్టింది.
తన వయసు హీరోల సరసన నటించడానికి అయితే కోటి రూపాయలలోపు ఇచ్చినా తీసుకుంటుంది. అదే తన వయసకు రెండున్నర రెట్లు ఉన్న చిరంజీవి సరసన నటించాలంటే.. కచ్చితంగా రెండున్నర కోట్లు ఇస్తేనే నటిస్తానని తేల్చిందట. అదేంటి చిరు సరసన నటించే ఛాన్స్ వస్తే ఎగిరి గంతేయాల్సింది అనే వారికి.. ఒక విషయం తెలియాలి. చిరంజీవి వయసు ఇప్పుడు ఆరు పదులు. అంటే బాలీవుడ్ లో అమితాబచ్చన్ మాదిరి కీ రోల్స్ పోషించాల్సిన సమయం . కానీ చిరు అందుకు భిన్నంగా హీరోగానే సిద్ద పడ్డారు. మరి ఆరు పదల హీరో పక్కన నటించడానికి కుర్ర హీరోయిన్స్ తమ గ్లామర్ ను ఎందుకు ఫణంగా పెడతారు. పెట్టాల్సి వచ్చినప్పుడు కనీసం రెమ్యున్ రేషన్ పరంగా అయిన గిట్టు బాటు కాక పోతే ఎందుకు చేస్తారు. సో నయనతార వెర్షన్ కరెక్ట్. ‘ఆటోజాని’ లో చిరంజీవి సరసన నయన నటించాలంటే నిర్మాత రాంచరణ్ అక్షరాల నయన కు రెండున్నల కోట్లు రెమ్యున్ రేషన్ సమర్పించుకోవాల్సిందే .
Advertisement