జాదూగాడు రివ్యూ

రేటింగ్: 2.75/5 “ప్రతి కథలోనూ రెండు క్యారక్టర్లు ఉంటాయని – ఒకటి హీరో – రెండు విలన్ – రెండూ నేనే” అని సినిమా మొదట్లోనే చెప్పేసుకున్న జాదూగాడి కథ యిది. ఇక్కడ గెలుపే  జీవితం.. ఐతే సాధించాలి లేదా చావాలి అని నమ్మి నయా జీవితంలో కష్టపడడం అంటే ఒళ్ళొంచడం కాదు, ఓనరుకి తల వంచడం కాదు, బుర్రవాడడం అని కథ మొదట్లోనూ  మరిచిపోతామన్నట్టు చివర్లోనూ మరీ చెప్పిన కథ యిది. అయితే ఆబుర్రను ఎందుకు వాడాడు అంటే – […]

Advertisement
Update:2015-06-26 09:29 IST

రేటింగ్: 2.75/5

“ప్రతి కథలోనూ రెండు క్యారక్టర్లు ఉంటాయని – ఒకటి హీరో – రెండు విలన్ – రెండూ నేనే” అని సినిమా మొదట్లోనే చెప్పేసుకున్న జాదూగాడి కథ యిది. ఇక్కడ గెలుపే జీవితం.. ఐతే సాధించాలి లేదా చావాలి అని నమ్మి నయా జీవితంలో కష్టపడడం అంటే ఒళ్ళొంచడం కాదు, ఓనరుకి తల వంచడం కాదు, బుర్రవాడడం అని కథ మొదట్లోనూ మరిచిపోతామన్నట్టు చివర్లోనూ మరీ చెప్పిన కథ యిది. అయితే ఆబుర్రను ఎందుకు వాడాడు అంటే – ఏం సాదించడానికి వాడాడు అంటే డబ్బు సంపాదించడానికి! ఆడబ్బుసాధించడానికి రాజకీయ వ్యవస్థలూ పోలీసు వ్యవస్థలూ మాఫియా బ్రోకర్ బినామీ ముఠాలూ ఆల్రెడీ పని చేస్తున్నాయి! అయితే అందులోకి ఓ చలాకీ తెలివీ సామర్ధ్యమూ వున్న కుర్రాడు చేరితే ఏమైంది అన్నదే ప్రధాన కథ!

నాలుగుప్రేమ కథలు తీసినాక మాస్ హీరో అయిపోవాలని ఎవరికైనా వుంటుంది. యాక్షన్ మూవీ చేసి పెద్ద హీరో కావాలని వుంటుంది. అలాంటి వాతావరణం వుండడం వల్ల మొనాటనీ వస్తుంది. వచ్చిన సినిమాలే వస్తాయి. మాస్ ఇమేజ్ కోరి నాగశౌర్య ప్రయత్నిస్తే – మొనాటనీ లేకుండా వుండేలా దర్శకుడు యోగి ప్రయత్నిచినా కథకు వాడుకున్న కేన్వాసు పాతది కావడం కథ చివరివరకు నడిపి చివరాఖర్న ట్విస్ట్ ముడులు విప్పడం వల్ల హాలీవుడ్ లో అరిగిన పాత పద్దతికే పోతోంది.

కథ కొస్తే – పాలమూరు కుర్రాడు క్రిష్ణ(నాగ శౌర్య) ఊరికి తలనొప్పి తెచ్చి మీరేంటి వేలేసేది నేనే వేలేస్తున్నా నంటూ కోటి రూపాయలు సంపాదించడానికి హైదరాబాద్ వస్తాడు. వచ్చి రెండు లక్షలు అప్పు చేసి బ్యాంకుకు కట్టి బ్యాంకు ఎగవేతదారులనుండి మనీ కలెక్ట్ చేయడంలో భాగంగా శ్రీశైలం(జాకీర్ హుస్సేన్) దృష్టిలో పడతాడు. అతని దగ్గర పని చేసే గుంటూరు శ్రీను (అజయ్) కి యిది నచ్చదు. శ్రీశైలానికి బ్యాక్ బోన్ గా జగదీష్ నాయుడు(కోట శ్రీనివాసరావు) పోలిటీసియన్ అండ వుంటుంది. కృష్ణ పేరుతొ రెండువేల కోట్ల డీల్ చేస్తారు. పని అయ్యాక ఫినిష్ చేయాలని చూస్తారు. మరో పక్క పోలీసు కమీషనర్(ఆశిష్ విద్యార్ధి) తన కూతురుకు కమిట్మెంట్ పాతిక కోట్లు యివ్వాలని సిఐ సెల్వ (రవికాలే) కు ఆ డబ్బు అప్పజెప్పాలని డ్యూటీ వేస్తాడు. ఇంకేముంది క్రిష్ణ ప్రేమించిన పార్వతీ వుమెన్ కొత్తన్ (సోనరిక భదోరియా) ని బంధించి శ్రీశైలం డీల్ వివరాలు క్రిష్ణ ద్వారా తెలుసుకొని ఆపనిని చేస్తాడు. కాని కథ మొత్తం క్రిష్ణ తన చేతిలోకి ఎలా తీసుకున్నాడన్నది మిగతా కథ చూడాల్సిందే!

సినిమా సెకండ్ అఫ్ సప్తగిరి కామిడీలో పడి కొట్టుకుంటుంది, ఒక దశలో వయాగ్రాతో చెలరేగి విసిగిస్తుంది. అలాగే తాగుబోతు రమేష్ క్యారక్టర్ వుండీ కథకు ప్రయోజనం లేదు. ఫ్రెండ్స్ క్యారక్టర్లు మధ్యలో మిస్ చేసారు గాని ఉపయోగించుకోలేదు. నాగ శౌర్య యాక్టివ్ గా చేసాడు, హీరోయిన్ కు ఎప్పటిలాగే స్పేస్ తక్కువ. ఆశిష్ వుండి వృధా. ఉపయోగించుకోలేదు. జాకీర్ హుస్సేన్, రవి కాలే లను యింకా ఉపయోగించుకొనే వీలుంది. ఆపని సరిగా జరగలేదు. కోటా ఓకే. కథ ఓకే. మాటలు పరవాలేదు. తొలిసారి మ్యూజిక్ అందించిన సాగర్ మహతి పరవాలేదనిపించాడు. చాలా కాలానికి యోగి స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసి నిరాశ పరచక పోయినా కథ టెంపోతో నడపడంలో జాగ్రత్తపడి వుంటే బావుండేది!

Tags:    
Advertisement

Similar News