తెలుగు సినిమాలు ఎందుకు ఆడటం లేదు?

టెన్‌ కమాండ్‌మెంట్స్‌: సినిమాలంటే విపరీతంగా ఇష్టపడే తెలుగువారు ఇప్పుడెందుకు సినిమాలకు దూరమవుతున్నారు? కారణం నిర్మాతలా? దర్శకులా? హీరోలా? నిజానికి కారణాలు కోకొల్లలు. కర్ణుడి చావులా సినిమాని ఎవరి లెవల్లో వాళ్ళు పొడిచేస్తున్నారు. కారణాలన్నింటిని ఒకసారిచూస్తే ఆడవాళ్ళు సినిమాలకి రావడం తగ్గిపోయింది. సీరియల్స్‌ ఒక కారణమైతే, వాళ్ళని థియేటర్‌కి రప్పించే సినిమాలు కరువైపోయాయి. క్రైం, ఫైటింగ్‌లు, పిచ్చిపిచ్చి డాన్స్‌లు, బూతు డైలాగులను  వాళ్ళు ఇష్టపడడం లేదు. హీరోల డేట్స్‌ దొరికిన వెంటనే నిర్మాతలు సినిమా తీసేస్తున్నారు. కథ గురించి […]

Advertisement
Update:2015-06-25 07:35 IST

టెన్కమాండ్మెంట్స్:

సినిమాలంటే విపరీతంగా ఇష్టపడే తెలుగువారు ఇప్పుడెందుకు సినిమాలకు దూరమవుతున్నారు? కారణం నిర్మాతలా? దర్శకులా? హీరోలా? నిజానికి కారణాలు కోకొల్లలు. కర్ణుడి చావులా సినిమాని ఎవరి లెవల్లో వాళ్ళు పొడిచేస్తున్నారు.

కారణాలన్నింటిని ఒకసారిచూస్తే

  1. ఆడవాళ్ళు సినిమాలకి రావడం తగ్గిపోయింది. సీరియల్స్‌ ఒక కారణమైతే, వాళ్ళని థియేటర్‌కి రప్పించే సినిమాలు కరువైపోయాయి. క్రైం, ఫైటింగ్‌లు, పిచ్చిపిచ్చి డాన్స్‌లు, బూతు డైలాగులను వాళ్ళు ఇష్టపడడం లేదు.
  2. హీరోల డేట్స్‌ దొరికిన వెంటనే నిర్మాతలు సినిమా తీసేస్తున్నారు. కథ గురించి సీరియస్‌గా చర్చించే టైం ఎవరికీ లేదు. అందుకే తలా తోకా లేని కథలు, మూసకథలు వచ్చేస్తున్నాయి. వాటిని జనం ఫుట్‌బాల్‌లా తంతున్నారు.
  3. సినిమాల్లో ఎవడిగోల వాడిదే. హీరో లవ్‌, దుబాయ్‌లో మాఫియా, విలన్‌పై పగ, విలన్‌ ఇంట్లో దూరి వాడిని ఫూల్‌ చేయడం, బ్రహ్మానందం కామెడీ ట్రాక్‌… ప్రేక్షకుడు ఎక్కడా ఐడెంటిఫై కావడం లేదు. తెరమీద నడిచే కథ ప్రేక్షకుడి గుండెని తాకడంలేదు.
  4. సినిమా చూసే ఖర్చు పెరిగిపోవడం. హైదరాబాద్‌ సిటీలో ఒక కుటుంబం సినిమా చూడాలంటే వెయ్యిరూపాయలు కావాలి. పైగా పదిరవై కిలోమీటర్ల ప్రయాణం.
  5. బిసి సెంటర్లలో థియేటర్లు అధ్వానంగా ఉండడం… సమ్మర్‌లో కూడా ఎసి వేయరు. కుర్చీలు సౌకర్యంగా ఉండవు. సినిమా ఒక బోర్‌ అయితే సిటింగ్‌ వల్ల ఒళ్ళు నొప్పులు
  6. తెలుగు నేటివిటి పూర్తిగా లోపించడం… సినిమాల్లోని హీరో హీరోయిన్లు వేరే దేశాల మనుషుల్లా కనిపిస్తున్నారు. స్పెయిన్‌, న్యూజిలాండ్‌లో తీస్తే సినిమా చూస్తారనుకోవడం భ్రమ. విదేశాలను చూడాలనే కోరికే ఉంటే డిస్కవరి ఛానల్‌, యూట్యూబ్‌ల్లో ఏదైనా చూడచ్చు. సినిమాలకే వెళ్ళక్కరలేదు. మన నిర్మాతలకు ఈ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో…
  7. వారసత్వపు నటుల్ని ప్రేక్షకుల నెత్తిన బలవంతంగా రుద్దడం… తాతలు నేతులు తాగారని వీళ్ళమూతుల్ని మనం వాసన చూడాలి. ఆ కంపుకి ప్రేక్షకులు భయపడుతున్నారు. పైగా వీళ్ళకి జీవితంలోని అనేక అంశాలు తెలియకపోవడం వల్ల మొహంలో ఏ భావాలు పలకడం లేదు. అంబ పలక్కపోయినా బలవంతంగా చప్పట్లు కొట్టాలంటే చేతులు రావడం లేదు.
  8. ఒకప్పుడు సంగీతం సినిమాకి ప్రాణం. ఇప్పుడు సినిమాలో అంతో ఇంతో ప్రాణముంటే వాయిద్యాల హోరు దాన్ని కూడా చంపేస్తూ ఉంది.
  9. డైరెక్టర్లు అప్‌డేట్‌ కాకపోవడం. ఇప్పటి యూత్‌ ఏమి ఆలోచిస్తూ ఉందో వీళ్ళకి తెలియదు. కాలేజీ అంటే అమ్మాయిల టీజింగ్‌, కుళ్ళుజోకులు, లెక్చరర్స్‌ని ఏడిపించడం అనుకుంటున్నారు. ఇప్పటి పిల్లలకు కెరీర్‌పై ఉన్న శ్రద్ధ మన డైరెక్టర్లకి అర్థం కావడం లేదు.
  10. రచయితకి గౌరవం పెరిగితే సినిమాకి గౌరవం పెరుగుతుంది. ఆటలో అరటిపండు, కూరలో కరివేపాకు, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా రచయితలు దొరుకుతారు అనుకున్నంత కాలం, సులభంగా డబ్బు ఎగ్గొట్టగలిగిన వ్యక్తిగా రచయితకి గుర్తింపు ఉన్నంత కాలం వచ్చేవాళ్ళు వస్తుంటారు, తీసేవాళ్ళు తీస్తుంటారు, డబ్బులు పొగొట్టుకుని వెళుతుంటారు

– జిఆర్‌. మహర్షి

Tags:    
Advertisement

Similar News