బాహుబలి పార్ట్-2పై అప్పుడే చర్చ
బాహుబలి సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. బాలీవుడ్ లో ఈ సినిమాపై కాస్త అంచనాలు పెరగడంతో రాజమౌళి మూవీ నేషనల్ ప్రాజెక్ట్ గా మారిపోయింది. అయితే సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారనే విషయం మనకు తెలిసిందే అయినప్పటికీ.. బాలీవుడ్ జనాలకు మాత్రం ఈ విషయం కొత్త. బాహుబలి రెండు భాగాలుగా వస్తుందనే వార్త తెలిసినప్పటి నుంచి అక్కడ మీడియాలో పార్ట్-2పై చర్చ మొదలైంది. మొదటి భాగం జులై 10న విడుదలవుతుంది కాబట్టి.. పార్ట్-2 ఎప్పుడు విడుదలవుతుంది,..? సెకెండ్ […]
Advertisement
బాహుబలి సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. బాలీవుడ్ లో ఈ సినిమాపై కాస్త అంచనాలు పెరగడంతో రాజమౌళి మూవీ నేషనల్ ప్రాజెక్ట్ గా మారిపోయింది. అయితే సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారనే విషయం మనకు తెలిసిందే అయినప్పటికీ.. బాలీవుడ్ జనాలకు మాత్రం ఈ విషయం కొత్త. బాహుబలి రెండు భాగాలుగా వస్తుందనే వార్త తెలిసినప్పటి నుంచి అక్కడ మీడియాలో పార్ట్-2పై చర్చ మొదలైంది. మొదటి భాగం జులై 10న విడుదలవుతుంది కాబట్టి.. పార్ట్-2 ఎప్పుడు విడుదలవుతుంది,..? సెకెండ్ పార్ట్ షూటింగ్ ఎప్పట్నించి మొదలవుతుంది..? పాత్రలేవైనా మారతాయా..? లాంటి ప్రశ్నలతో బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో రాజమౌళి పార్ట్-2పై పెదవి విప్పాడు. బాహుబలి పార్ట్-2 అప్పుడే 30శాతం షూటింగ్ పూర్తిచేసుకుందని ప్రకటించాడు రాజమౌళి. పార్ట్-1 విడుదలైన తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని, పార్ట్-2 షూటింగ్ మొదలుపెడతామన్నాడు. సరిగ్గా పార్ట్-1 విడుదలైన ఏడాదికి బాహుబలి పార్ట్-2ను థియేటర్లలోకి తీసుకొస్తామంటున్నాడు దర్శకుడు రాజమౌళి. హీరోలు, హీరోయిన్లు మారకపోయినప్పటికీ.. పాత్రలకు తగ్గట్టు మరికొంతమంది నటులు వచ్చిచేరుతారంటున్నాడు జక్కన్న.
Advertisement