బాహుబ‌లి క‌థ ఎలా పుట్టిందంటే..! 

ద‌ర్శ‌క దిగ్గ‌జం  రాజ‌మౌళి  చేసిన బాహుబ‌లి చిత్రం  ఇప్ప‌టికే  దేశ వ్యాప్తంగా మోస్ట్ ఎవైయింటింగ్ ఫిల్మ్ గా  హైపు క్రియోట్ చేసుకుంది.  ఈ చిత్ర క‌థ  రూపం పోసుకోవ‌డం వెన‌క చాల ఆస‌క్తి క‌ర‌మైన విష‌యాలు  తెలిపారు రాజ‌మౌళి. ఈ క‌థ‌కు సంబంధించి మొద‌టి పుట్టిన క్యారెక్ట‌ర్  శివ‌గామి. ఆ త‌రువాత  భ‌ళ్లాల దేవ .. ఆ త‌రువాత  క‌ట్టాప్ప‌..ఇలా  మ‌రో రెండు కీల‌క‌మైన క్యారెక్ట‌ర్స్  మాత్ర‌మే పుట్టాయ‌ట‌. ఏడు ఎనిమిది క్యారెక్ట‌ర్స్ పుట్టిన త‌రువాత‌..ఈ క్యారెక్ట‌ర్స్ […]

Advertisement
Update:2015-06-22 06:33 IST

ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి చేసిన బాహుబ‌లి చిత్రం ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా మోస్ట్ ఎవైయింటింగ్ ఫిల్మ్ గా హైపు క్రియోట్ చేసుకుంది. ఈ చిత్ర క‌థ రూపం పోసుకోవ‌డం వెన‌క చాల ఆస‌క్తి క‌ర‌మైన విష‌యాలు తెలిపారు రాజ‌మౌళి. ఈ క‌థ‌కు సంబంధించి మొద‌టి పుట్టిన క్యారెక్ట‌ర్ శివ‌గామి. ఆ త‌రువాత భ‌ళ్లాల దేవ .. ఆ త‌రువాత క‌ట్టాప్ప‌..ఇలా మ‌రో రెండు కీల‌క‌మైన క్యారెక్ట‌ర్స్ మాత్ర‌మే పుట్టాయ‌ట‌. ఏడు ఎనిమిది క్యారెక్ట‌ర్స్ పుట్టిన త‌రువాత‌..ఈ క్యారెక్ట‌ర్స్ ను అన్నింటిని క‌లిపి సినిమాగా చేస్తే బావుంటుంద‌ని రాజ‌మౌళి బాహుబ‌లి క‌థ ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ కు తెలిపార‌ట‌. అంతే రెండు నెల‌లో బాహుబ‌లి స్టోరి పూర్తిగా రెడి అయిపోయింద‌ట‌. క‌థ అంతా తీయాలంటే క‌చ్చితంగా రెండు భాగాలుగా చేస్తేనే సాధ్య ప‌డుతుంద‌ని అప్పుడే ఫిక్స్ అయ్యార‌ట‌. మొత్తం మీద మూడు సంవ‌త్స‌రాలు పాటు వందలాది టెక్నిషియ‌న్స్ క‌ష్టం త్వ‌ర‌లో తెర మీద క‌నిపించ బోతుంది.బొమ్మ బాక్సాఫీస్ ను క‌బాడ్డీ అడ‌టం ఖాయంగా క‌నిపిస్తుంది. జూలై 10న బాహుబ‌లి చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు తో పాటు మ‌రో మూడు లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News