హీరోగా క్రికెటర్ శ్రీశాంత్

క్రికెటర్ గా ఇక కెరీర్ లేదని ఎప్పుడో ఫిక్సయిపోయాడు స్టార్ బౌలర్ శ్రీశాంత్. అందుకే ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే పలుమార్లు సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చేందుకు విశ్వప్రయత్నం చేశాడు శ్రీశాంత్. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి ఓ ద్విభాషా చిత్రంలో నటించే అవకాశం అందుకున్నాడు. సంపంగి, పిట్టలదొర, బ్యాచిలర్స్ లాంటి సినిమాలు తీసిన సానా యాదిరెడ్డి దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో నటించడానికి శ్రీశాంత్ ఒప్పుకున్నాడనేకంటే.. శ్రీశాంత్ తో […]

Advertisement
Update:2015-06-21 06:10 IST
క్రికెటర్ గా ఇక కెరీర్ లేదని ఎప్పుడో ఫిక్సయిపోయాడు స్టార్ బౌలర్ శ్రీశాంత్. అందుకే ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే పలుమార్లు సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చేందుకు విశ్వప్రయత్నం చేశాడు శ్రీశాంత్. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి ఓ ద్విభాషా చిత్రంలో నటించే అవకాశం అందుకున్నాడు. సంపంగి, పిట్టలదొర, బ్యాచిలర్స్ లాంటి సినిమాలు తీసిన సానా యాదిరెడ్డి దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో నటించడానికి శ్రీశాంత్ ఒప్పుకున్నాడనేకంటే.. శ్రీశాంత్ తో సినిమా చేసేందుకు సానా యాదిరెడ్డి ఒప్పుకున్నాడనడం కరెక్ట్. ఈ ప్రాజెక్ట్ తో పాటు మధుర శ్రీధర్ తో మరో సినిమా చేసేందుకు కూడా రెడీ అవుతున్నాడు శ్రీశాంత్. ఈ రెండు సినిమాలు తెలుగు-తమిళ భాషల్లోనే తెరకెక్కుతాయి. వచ్చే నెలలో ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఓ క్లారిటీ వస్తుంది. స్వయంగా శ్రీశాంత్, హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మూవీస్ విశేషాలు తెలిపే అవకాశం ఉందంటున్నారు.
Tags:    
Advertisement

Similar News