సమంత మాటల్లో చెప్పలేక పోతుందట..
కెరీర్ ప్రారంభంలో కొంత లక్..కొంత గ్లామర్ తో షార్ట్ టైమ్ లో రివ్వున దూసుకొచ్చిన అందాల ముద్దుగుమ్మ సమంత. మహేష్ బాబు తో చేసిన దూకుడు చిత్రం తో స్టార్ హీరోయిన్స్ లీగ్ లో రాయల్ ఎంట్రీ కొట్టేసింది. మహేష్ బాబు తో రెండు , ఎన్టీఆర్ తో రెండు..పవన్ కళ్యాణ్ తొ ఒకటి.. ఇలా స్టార్ హీరోలతో చేసి.. స్టార్ డమ్ ను స్థిరపరుచుకుంది. అయితే ప్రస్తుతం కెరీర్ పరంగా చాల టఫ్ టైమ్ ఎదుర్కొంటుంది. […]
Advertisement
కెరీర్ ప్రారంభంలో కొంత లక్..కొంత గ్లామర్ తో షార్ట్ టైమ్ లో రివ్వున దూసుకొచ్చిన అందాల ముద్దుగుమ్మ సమంత. మహేష్ బాబు తో చేసిన దూకుడు చిత్రం తో స్టార్ హీరోయిన్స్ లీగ్ లో రాయల్ ఎంట్రీ కొట్టేసింది. మహేష్ బాబు తో రెండు , ఎన్టీఆర్ తో రెండు..పవన్ కళ్యాణ్ తొ ఒకటి.. ఇలా స్టార్ హీరోలతో చేసి.. స్టార్ డమ్ ను స్థిరపరుచుకుంది. అయితే ప్రస్తుతం కెరీర్ పరంగా చాల టఫ్ టైమ్ ఎదుర్కొంటుంది. గత యేడాది సమంత నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ దగ్గర గల్లంతయ్యాయి. దీంతో తెలుగులో ప్రస్తుతం ఆఫర్స్ లేవు. తమిళ్ లో మాత్రం గత యేడాది విజయ్ సరసన నటించిన కత్తి చిత్రం ఘన విజయం సాధించడంతో కొంత వరకు సేఫ్ జోన్ లోఉంది. దీంతో కోలీవుడ్ లో కెరీర్ పరంగా ఉత్సాహంగా ఉంది.
అయితే కెరీర్ పరంగా తను సినిమా హీరోయిన్ గా ఎంతో సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపింది. హీరోయిన్ అవ్వకపోయినా.. కచ్చితంగా క్రియేటివ్ ఫిల్డ్ లోనే స్థిరపడేదట. తనకు సంబంధం లేని వాళ్లు కూడా తన పై ప్రేమను కురిపిస్తున్నారంటే హీరోయిన్ గా ఇంతకంటే ఇంకేమి కావాలంటోంది. హీరోయిన్ కావడం నిజంగా చాల అదృష్టమని మురిసి పోతుంది. అయితే కెరీర్ ప్రారంభంలో లక్ ఎంతో ప్లే చేసిందని.. ఇప్పుడు మాత్రం కేవలం టాలెంట్ మాత్రమే అవసరమని ..ఇదే తనను నటిగా ముందుకు తీసుకెళ్తుందని ఆశ పడుతుంది.
Advertisement