గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టుకు అంత‌ర్జాతీయ హోదా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానికి చేరువ‌లో…విజ‌య‌వాడ‌కు స‌మీపంలోని గన్నవరం విమానాశ్రయానికి అంత‌ర్జాతీయ సొబ‌గు ద‌క్క‌నుంది. దీనికి సంబంధించి ఉన్న నాలుగు ప్ర‌క్రియ‌ల్లో రెండు ద‌శ‌ల‌ను ఇప్ప‌టికే పూర్తి చేసుకుంది. మరో రెండు దశలు దాటితే పూర్తిస్థాయిలో అంతర్జాతీయ హోదా దక్కినట్లే. మొదటి ప్రక్రియలో ప్రస్తుతం 7500 మీటర్లున్న ఎయిర్‌పోర్టు రన్‌వేను 14 వేల మీటర్లకు విస్తరించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎయిర్‌ పోర్టు అధికారులు రెండు దశల్లో 660 ఎకరాలు అవసరమని ప్రతిపాదించారు. మొదటి ఫేజ్‌లో 460 ఎకరాలకు సంబంధించి […]

Advertisement
Update:2015-06-13 05:51 IST
గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టుకు అంత‌ర్జాతీయ హోదా
  • whatsapp icon
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానికి చేరువ‌లో…విజ‌య‌వాడ‌కు స‌మీపంలోని గన్నవరం విమానాశ్రయానికి అంత‌ర్జాతీయ సొబ‌గు ద‌క్క‌నుంది. దీనికి సంబంధించి ఉన్న నాలుగు ప్ర‌క్రియ‌ల్లో రెండు ద‌శ‌ల‌ను ఇప్ప‌టికే పూర్తి చేసుకుంది. మరో రెండు దశలు దాటితే పూర్తిస్థాయిలో అంతర్జాతీయ హోదా దక్కినట్లే. మొదటి ప్రక్రియలో ప్రస్తుతం 7500 మీటర్లున్న ఎయిర్‌పోర్టు రన్‌వేను 14 వేల మీటర్లకు విస్తరించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎయిర్‌ పోర్టు అధికారులు రెండు దశల్లో 660 ఎకరాలు అవసరమని ప్రతిపాదించారు. మొదటి ఫేజ్‌లో 460 ఎకరాలకు సంబంధించి భూ సేకరణ, భూ సమీకరణ కూడా జరుగుతోంది. రెండో ప్రక్రియగా కస్టమ్స్‌, మూడో ప్రక్రియగా ఇమ్మిగ్రేషన్‌ విభాగాలు ఏర్పాటు చేయాలి. కస్టమ్స్‌ విభాగం ఏర్పాటు ద్వారా రెండో ప్రక్రియ పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలోనే కస్టమ్స్‌ హోదా ప్రకటించబోతోంది. ఇక మిగిలింది మూడు, నాలుగు ప్రక్రియలే. మూడో ప్రక్రియలో భాగంగా ఇమ్మిగ్రేషన్‌శాఖతో చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ విభాగాన్ని ఏర్పాటు చేయటానికి తగిన చోటు కల్పించాలన్న ప్రతిపాదన ఆ శాఖ నుంచి వచ్చింది. దీని కోసం ఇటీవల పొడిగించిన టెర్మినల్‌ బిల్డింగ్‌లో చోటు కల్పిస్తామని విమానాశ్రయ అధికారులు చెప్పారు. ఇక ఇది ఎప్పుడు ఏర్పాటవుతుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. నాలుగో ప్రక్రియ అన్నింటి కంటే అతి ముఖ్యమైనది. విదేశీ విమానాల రాకపోకలకు సంబంధించి కేంద్ర క్యాబినెట్‌ అనుమతులు జారీ చేయడం. దీనిపై త్వరలో క్యాబినెట్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది.
Tags:    
Advertisement

Similar News