బాహుబలి మొత్తం 8పాటలు ఇంటర్నెట్ లో లీక్..?

ఇప్పటికే బాహుబలికి సంబంధించి ఓ యుద్ధ సన్నివేశం లీకైంది. ఎవరో యూనిట్ సభ్యుడే సినిమాలో అత్యంత కీలకమైన ఓ ఫైట్ సీక్వెన్స్ ను గ్రాఫిక్ దశలో ఉంటుండగా నెట్ లో లీక్ చేశాడు. దీంతో షాక్ కు గురైన రాజమౌళి, ఏకంగా ఆ సన్నివేశాన్నే సినిమాలో లేకుండా తొలిగించేశాడు. ఆ తర్వాత ఎలాంటి లీకులు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేశాడు. అయితే రాజమౌళి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ లీకులు మాత్రం బాహుబలికి వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా […]

Advertisement
Update:2015-06-11 05:40 IST
బాహుబలి మొత్తం 8పాటలు ఇంటర్నెట్ లో లీక్..?
  • whatsapp icon

ఇప్పటికే బాహుబలికి సంబంధించి ఓ యుద్ధ సన్నివేశం లీకైంది. ఎవరో యూనిట్ సభ్యుడే సినిమాలో అత్యంత కీలకమైన ఓ ఫైట్ సీక్వెన్స్ ను గ్రాఫిక్ దశలో ఉంటుండగా నెట్ లో లీక్ చేశాడు. దీంతో షాక్ కు గురైన రాజమౌళి, ఏకంగా ఆ సన్నివేశాన్నే సినిమాలో లేకుండా తొలిగించేశాడు. ఆ తర్వాత ఎలాంటి లీకులు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేశాడు. అయితే రాజమౌళి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ లీకులు మాత్రం బాహుబలికి వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా పాటలు నెట్ లో ప్రత్యక్షమయ్యాయి.

ఈనెల 13న అంటే శనివారం బాహుబలి పాటల్ని గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఎన్నో చర్చల అనంతరం తిరుపతి వేదికగా బాహుబలి ఆడియో ఫంక్షన్ ను కన్నులపండువగా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తిరుపతిలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో బాహుబలి పాటల్ని ఎవడో ఆకతాయి ముందుగానే నెట్ లో పెట్టేశాడు. బాహుబలి పార్ట్-1లో థీమ్ సాంగ్ తో కలిపి మొత్తం 8 పాటలున్నాయి. ఈ 8 పాటలూ ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో సినిమా యూనిట్ షాక్ కు గురైంది. దీనిపై సైబర్ పోలీసుల్ని ఆశ్రయించాలని నిర్ణయించుకుంది.

Tags:    
Advertisement

Similar News