పవన్ ' మెగా బంధం' వెనుక పరమార్ధం ఏమిటి?
‘గబ్బర్ సింగ్-2’ చిత్రం పూర్తి కాగానే వరుసగా రెండు చిత్రాలు చేయాలని, ఇకపై ఏడాదికి రెండు మూడు చిత్రాల్లో నటించాలని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది… తన ఫ్యాన్స్ ను సంతృప్తి పరచేందుకే పవన్ స్పీడు పెంచుతున్నాడని అనుకోవచ్చు. అలాగే తమ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ నంతా ఒక్కటి చేయాలనీ పవన్ తపిస్తున్నట్టు కూడా చెబుతున్నారు… అందులో భాగంగానే ‘గబ్బర్ సింగ్-2’ ఫస్ట్ లుక్ ను తన అన్నయ్య చిరంజీవి పుట్టినరోజయిన ఆగస్టు 22న […]
Advertisement
‘గబ్బర్ సింగ్-2’ చిత్రం పూర్తి కాగానే వరుసగా రెండు చిత్రాలు చేయాలని, ఇకపై ఏడాదికి రెండు మూడు చిత్రాల్లో నటించాలని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది… తన ఫ్యాన్స్ ను సంతృప్తి పరచేందుకే పవన్ స్పీడు పెంచుతున్నాడని అనుకోవచ్చు. అలాగే తమ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ నంతా ఒక్కటి చేయాలనీ పవన్ తపిస్తున్నట్టు కూడా చెబుతున్నారు… అందులో భాగంగానే ‘గబ్బర్ సింగ్-2’ ఫస్ట్ లుక్ ను తన అన్నయ్య చిరంజీవి పుట్టినరోజయిన ఆగస్టు 22న విడుదల చేయాలనీ పవన్ భావిస్తున్నాడట… ఇప్పటిదాకా అన్నయ్య చిరంజీవితో ఎడమొగం-పెడమొగంగా ఉంటున్న ఈ తమ్ముడు పవన్ కళ్యాణ్‌లో సడన్‌గా ఇంత ఛేంజ్ ఎందుకొచ్చిందో అర్ధం కావడం లేదు. దీని వెనుక ఏమైనా రాజకీయ కారణాలున్నాయా అన్నది ఆలోచించాలి. సహజంగా తన జనసేన పార్టీ కోసం చిరంజీవిని దగ్గరకు తీసుకునే తత్వం పవన్‌ది కాదు. కాని భారతీయ జనతాపార్టీతో సయోధ్యతో ఉన్న పవన్‌కు చేరువవడం ద్వారా చిరంజీవి ఏమైనా ప్రయోజనం ఆశిస్తున్నారా అనే కోణంలో ఆలోచిస్తే ఎవరికైనా కొన్ని సందేహాలు వస్తాయి. ఈ మెగా మేళవింపు అసలు అర్ధం ఏమిటో ఇప్పటికప్పుడు తెలియకపోయినా ఏదో రోజు బయట పడక తప్పదు. అప్పటి వరకు లెట్స్ వెయిట్ అండ్ సీ!
Advertisement