రేణు దేశాయ్ ఎవరి రెండో పెళ్ళి గురించి మాట్లాడుతున్నారు?
పవన్ కల్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల ట్విట్టర్లో పోస్ట్ట్ చేసిన కొన్ని ట్వీట్స్ చూస్తే, తాను పదే పదే పవన్ మూడో పెళ్ళి అంశాన్ని ప్రస్తావిస్తున్నారని అనిపిస్తుంది. కాని అందులో తన రెండో పెళ్ళి విషయం ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇటీవల ఒక పవన్ వీరాభిమాని ట్విట్టర్లో రచ్చ రచ్చ చేసాడు..రేణూని పవన్ దగ్గరికి వెళ్ళిపొమ్మని. పెళ్ళయ్యి, ఇంకో భార్య, కూతురు ఉన్న అతడి దగ్గరికి ఎలా వెళ్ళిపొమ్మంటారని నిలదీసింది. ఆమె ఆవేదనకు […]
పవన్ కల్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల ట్విట్టర్లో పోస్ట్ట్ చేసిన కొన్ని ట్వీట్స్ చూస్తే, తాను పదే పదే పవన్ మూడో పెళ్ళి అంశాన్ని ప్రస్తావిస్తున్నారని అనిపిస్తుంది. కాని అందులో తన రెండో పెళ్ళి విషయం ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇటీవల ఒక పవన్ వీరాభిమాని ట్విట్టర్లో రచ్చ రచ్చ చేసాడు..రేణూని పవన్ దగ్గరికి వెళ్ళిపొమ్మని. పెళ్ళయ్యి, ఇంకో భార్య, కూతురు ఉన్న అతడి దగ్గరికి ఎలా వెళ్ళిపొమ్మంటారని నిలదీసింది.
ఆమె ఆవేదనకు ట్విట్టర్లో చాలా సపోర్ట్ లభించింది. కొందరు ఆమెను కూడా రెండో పెళ్ళి చేసుకొమ్మని సలహా ఇచ్చారు. అలా చేస్తే..నన్ను ఎన్ని పేర్లతో పిలుస్తారో ఊహించలేను…పైగా ఇంకో వ్యక్తిని ఈ రొంపిలోకి దించితే..అతడిని కూడా వదలరు కదా అని అభిప్రాయపడింది. నిజమే కదా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్‌గా మగవాడు పిల్లలున్నా ఇంకో పెళ్ళి చేసుకుంటాడని, విడాకులు తీసుకున్న భార్య మాత్రం…ఆ పిల్లల బాధ్యత మోస్తూ …కట్టుబడి ఉండాల్సిందేనని ఆవేదన చెందింది.