కమల్ ముద్దుకి బలి అయ్యింది తెలుగమ్మాయే...

కమల్ హాసన్ ఈ సారి తెలుగు వారిని డైరెక్ట్ తెలుగు సినిమాల‌తోనే పలకరిస్తానని చెప్పి, నిజంగానే మాట నిలబెట్టుకుంటున్నారు. త్వరలో ‘చీకటి రాజ్యం’ అనే ద్విభాషా చిత్రంతో రాబోతున్నారు. కమల్తో బాటు త్రిష, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆ సినిమాని హైదరాబాదులో లాంచ్ సందర్భంలో కొన్ని పోష్టర్స్‌ని రిలీజ్ చేసారు. అందులో ఒక పోష్టర్‌లో కమల్ ఒక అమ్మాయిని కసిగా ముద్దు పెడుతున్న ఫోజ్ అందరికీ నచ్చింది. ఆ అమ్మాయి ఎవరో చాలా ఊహాగానాలు […]

Advertisement
Update:2015-06-08 11:54 IST
కమల్ హాసన్ ఈ సారి తెలుగు వారిని డైరెక్ట్ తెలుగు సినిమాల‌తోనే పలకరిస్తానని చెప్పి, నిజంగానే మాట నిలబెట్టుకుంటున్నారు. త్వరలో ‘చీకటి రాజ్యం’ అనే ద్విభాషా చిత్రంతో రాబోతున్నారు. కమల్తో బాటు త్రిష, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆ సినిమాని హైదరాబాదులో లాంచ్ సందర్భంలో కొన్ని పోష్టర్స్‌ని రిలీజ్ చేసారు. అందులో ఒక పోష్టర్‌లో కమల్ ఒక అమ్మాయిని కసిగా ముద్దు పెడుతున్న ఫోజ్ అందరికీ నచ్చింది.
ఆ అమ్మాయి ఎవరో చాలా ఊహాగానాలు చేసారు. ఎందుకంటే, అమ్మాయి వెనుక భాగం మాత్రమే కనిపిస్తుంది కనుక. స్వయంగా ఆ తెలుగమ్మాయి బయట పెట్టేవరకు, ఆమె త్రిష అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. కాని కాదట. కమల్ ముద్దాడింది మధుశాలినిని. ఈ విషయం స్వయంగా మధుశాలినినే బయట పెట్టింది. కమల్ చేత ముద్దు పెట్టించుకున్న ఎక్జైట్‌మెంట్ ఆగుతుందా మరి చెప్పండి? ‘చీకటి రాజ్యం ‘లో మధు ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తుందని, అది తాను ఈ మధ్య చేసిన కేమియో అప్పియరెన్సెస్ లాంటిది కాదని ఎంతో సంతోష పడుతోంది మన తెలుగమ్మాయి.
Tags:    
Advertisement

Similar News