చంద్రబాబుకు పదవిలో కొనసాగే హక్కు లేదు: పొంగులేటి
ఎమ్మెల్సీ ఓట్ల కొనుగోలు కేసులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినట్టు ఆడియోసాక్ష్యాలు బయటపడిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు పెట్టి, అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రత్యక్షంగా మాట్లాడిన ఆడియోటేపులు బహిర్గతమైన అంశాన్ని ఏసీబీ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. నీతిసూత్రాలు, నైతిక విలువలంటూ మాట్లాడే చంద్రబాబు నిజస్వరూపం ఏమిటో […]
Advertisement
ఎమ్మెల్సీ ఓట్ల కొనుగోలు కేసులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినట్టు ఆడియోసాక్ష్యాలు బయటపడిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు పెట్టి, అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రత్యక్షంగా మాట్లాడిన ఆడియోటేపులు బహిర్గతమైన అంశాన్ని ఏసీబీ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. నీతిసూత్రాలు, నైతిక విలువలంటూ మాట్లాడే చంద్రబాబు నిజస్వరూపం ఏమిటో ఈ టేపుల ద్వారా వెల్లడైందని విమర్శించారు. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడారో తేల్చడానికి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement