బాహుబలి స్టోరీ లీక్ : రాజమౌళికి నష్టం ఏంటట?
బాహుబలి ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి, ఈ భారీ బడ్జెట్ మూవీ స్టోరీ లైన్‌పై అనేకానేక ఊహాగానాలు బయలుదేరాయి. అదే విధంగా ఇప్పుడు, బాహుబలి కథ ఇదంటూ ఆన్‌లైన్‌లో మొత్తం కథ లీక్ అయ్యింది. రిలీజ్‌కి ముందే కథ లీక్ అవ్వడం ఏ సినిమాకైనా మైనస్సే! కాని రాజమౌళికి కూడా మైనస్సేనా? రాజమౌళి గత సినిమాల ప్రమోషన్స్‌ని జాగ్రత్తగా గమనిస్తే ఈజీగా అర్థం అయ్యిపోయే విషయం… తాను కథ విషయంలో ఒక టెక్నిక్ ఫాలో […]
బాహుబలి ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి, ఈ భారీ బడ్జెట్ మూవీ స్టోరీ లైన్‌పై అనేకానేక ఊహాగానాలు బయలుదేరాయి. అదే విధంగా ఇప్పుడు, బాహుబలి కథ ఇదంటూ ఆన్‌లైన్‌లో మొత్తం కథ లీక్ అయ్యింది. రిలీజ్‌కి ముందే కథ లీక్ అవ్వడం ఏ సినిమాకైనా మైనస్సే! కాని రాజమౌళికి కూడా మైనస్సేనా?
రాజమౌళి గత సినిమాల ప్రమోషన్స్‌ని జాగ్రత్తగా గమనిస్తే ఈజీగా అర్థం అయ్యిపోయే విషయం… తాను కథ విషయంలో ఒక టెక్నిక్ ఫాలో అవుతాడని. మరాద రామన్న, ఈగ మొదలగు సినిమాల విషయంలో కథ రిలీజ్‌కి ముందే చెప్పి మరీ.. ఆడియెన్స్‌ని థియేటర్స్‌కి ఆకర్షింపగలిగాడు.
అయినా బాహుబలి కథ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం పెద్ద విషయమే కాదు. ట్రెయిలర్ ద్వారా కథ ఆల్రెడీ చాలా వరకు అర్థం అయిపోయింది. ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్న కథ మనం ఊహించినదే. రాజమౌళికి ఈ లీక్ వలన నష్టం ఏమీ లేదు. మన జక్కన్నకు స్టోరీ ముందే చెప్పే అలవాటుకి ఆ లీకర్స్ కూడా తోడ్పడినవారు అయ్యారు అంతే! కథా కథనం, ఎమోషన్స్ మరియు టెక్నికల్ అంశాలతో మ్యాజిక్ చేయగల మౌళికి ఇదేమి లెక్క కాదు కదా!