'సింగం 123' ని ఎంజాయ్ చేయవచ్చు :మోహన్ బాబు
పద్మశీ డాక్టర్ మోహన్ బాబు కు కోపం వస్తే తట్టుకోవడం కష్టమే. ఆయన మనసులో దాచుకోవడాలు అంటూ ఏమి ఉండవు. ఏదైనా కుండ బద్దలు కొట్టాల్సిందే. తాజాగ ఆయన తనయుడు మంచు విష్ణు నిర్మాతగా చేసిన సింగం 123 చిత్రం విడుదల గురించి ప్రెస్ మీట్ జరిపారు. ఈ చిత్రం ఆడియో లాంచ్ రోజు హీరో సంపూర్ణేష్ బాబు.. తనకు మోహన్ బాబు ఏకలవ్య గురువు అని చెప్పిన విషయం తెలిసిందే. తను అసువుగా డైలాగ్స్ […]
Advertisement
పద్మశీ డాక్టర్ మోహన్ బాబు కు కోపం వస్తే తట్టుకోవడం కష్టమే. ఆయన మనసులో దాచుకోవడాలు అంటూ ఏమి ఉండవు. ఏదైనా కుండ బద్దలు కొట్టాల్సిందే. తాజాగ ఆయన తనయుడు మంచు విష్ణు నిర్మాతగా చేసిన సింగం 123 చిత్రం విడుదల గురించి ప్రెస్ మీట్ జరిపారు. ఈ చిత్రం ఆడియో లాంచ్ రోజు హీరో సంపూర్ణేష్ బాబు.. తనకు మోహన్ బాబు ఏకలవ్య గురువు అని చెప్పిన విషయం తెలిసిందే. తను అసువుగా డైలాగ్స్ చెప్పడానికి ప్రేరణ మోహన్ బాబే అని చెప్పారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ. ప్రెస్ మీట్ లో సంపూను ఉద్దేశించి.. తను నన్ను కాపి కొట్టాడని సరదగా అన్నారు. ఇక ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ ప్యారడి. మొదటి సీన్ నుంచి నవ్వుకుంటూ సినిమాను ఎంజాయ్ చేస్తారని తెలిపారు. మొదటి చిత్రం హృదయ కాలేయం కంటే..ఈ సినిమా సంపూ కు మరింత హెల్ప్ అవుతుందంటున్నారు చిత్ర యూనిట్.
Advertisement