గచ్చిబౌలిలో మరో ఐటి టవర్: కేటీఆర్‌

త్వరలోనే తెలంగాణలో మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ రానుందని ఐటి, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి కె తారకరామారావు తెలిపారు. తెలంగాణను స్టార్టప్‌ కంపెనీలకు కేంద్రంగా మార్చనున్నట్టు కెటిఆర్‌ చెప్పారు. మరో 15 రోజుల్లో టి హబ్‌ ఏర్పాటు చేయబోతున్నామ‌ని, చిన్న చిన్న ఐటి కంపెనీల కోసం గచ్చిబౌలిలో మరో ఐటి టవర్‌ నిర్మిస్తామని ఆయ‌న తెలిపారు. మరో ఐదేళ్లలో తెలంగాణ నుంచి ఐటి ఎగుమతులు రూ.1.20 లక్షల కోట్లకు చేరతాయని  చెప్పారు. 2014-15లో రాష్ట్రం నుంచి ఐటి […]

Advertisement
Update:2015-06-03 03:08 IST
త్వరలోనే తెలంగాణలో మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ రానుందని ఐటి, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి కె తారకరామారావు తెలిపారు. తెలంగాణను స్టార్టప్‌ కంపెనీలకు కేంద్రంగా మార్చనున్నట్టు కెటిఆర్‌ చెప్పారు. మరో 15 రోజుల్లో టి హబ్‌ ఏర్పాటు చేయబోతున్నామ‌ని, చిన్న చిన్న ఐటి కంపెనీల కోసం గచ్చిబౌలిలో మరో ఐటి టవర్‌ నిర్మిస్తామని ఆయ‌న తెలిపారు. మరో ఐదేళ్లలో తెలంగాణ నుంచి ఐటి ఎగుమతులు రూ.1.20 లక్షల కోట్లకు చేరతాయని చెప్పారు. 2014-15లో రాష్ట్రం నుంచి ఐటి ఎగుమతులు రూ.66,276 కోట్లకు చేరాయన్నారు. రాష్ట్ర ఐటి శాఖ వార్షిక నివేదిక విడుదల చేస్తూ ఆయన ఈ విషయాలు చెప్పారు. గత ఏడాది కొత్తగా 50 వేల ఉద్యోగాల కల్పనతో ప్రత్యక్షంగా ఈ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య 3,71,774కి చేరిందన్నారు. ఫైబర్‌ కేబుల్‌ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించబోతున్నట్టు చెప్పారు. త్వరలోనే కొత్త ఐటి విధానం ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్‌ కు అన్ని వైపులా ఐటి క్లస్టర్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో వైఫై, 4జి సేవలను మరింత విస్తరించనున్నట్టు కెటిఆర్‌ తెలిపారు. గూగుల్‌ సంస్థ గచ్చిబౌలిలోని తన క్యాంపస్‌ను మరింత విస్తరించనుందని చెప్పారు.
Tags:    
Advertisement

Similar News