మెరుపు వేగంతో వేసేశాడట..
డ్యాన్స్ ఫ్లోర్ పై ఫైర్ పుట్టించే హీరోల్లో రాంచరణ్ ఒకరు. తండ్రికి తగ్గ తనయుడిగా ఈ విషయంలో బాగానే సక్సెస్ అయ్యాడు రాంచరణ్. ప్రస్తుతం శీను వైట్ల దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాంచరణ్ .. ఫైట్ మాష్టర్ గా కనిపించనున్నారు. ఇందుకోసం ధాయ్ లాండ్ లో ఒక హాలీవుడ్ స్టంట్ మాస్టర్ దగ్గర స్పెషల్ ఫైట్స్ నేర్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు విదేశాల్లోనే […]
Advertisement
డ్యాన్స్ ఫ్లోర్ పై ఫైర్ పుట్టించే హీరోల్లో రాంచరణ్ ఒకరు. తండ్రికి తగ్గ తనయుడిగా ఈ విషయంలో బాగానే సక్సెస్ అయ్యాడు రాంచరణ్. ప్రస్తుతం శీను వైట్ల దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాంచరణ్ .. ఫైట్ మాష్టర్ గా కనిపించనున్నారు. ఇందుకోసం ధాయ్ లాండ్ లో ఒక హాలీవుడ్ స్టంట్ మాస్టర్ దగ్గర స్పెషల్ ఫైట్స్ నేర్చుకున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు విదేశాల్లోనే చేశారు. పాటల్ని ముందుగా షూట్ చేశారట. చాలా కాలం తర్వాత రాంచరణ్ కొన్ని పాటలకు మెరుపు వేగంతో స్టెప్స్ వేశారట. బాగా పెయిన్ అనిపించినప్పటికి అస్వాదించినట్లు ఫేస్ బుక్ లో తెలిపారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. కోన వెంకట్, గోపి మోహన్ సంభాషణలు రాస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. మొత్తం మీద ఈ చిత్రంలో పోరాట సన్నివేశాలు..ఇటు సాంగ్స్ ఒక రేంజ్ లో అభిమానుల్ని అలరిస్తాయనడంలో సందేహాం లేదు మరి.
Advertisement