ముగిసిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆరు స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్థులు పోటీచేసిన ఈ ఎన్నిక‌ల్లో 118 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొని త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. వామ‌ప‌క్షాల‌కు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి తుమ్మల, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్‌, యాదవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ నుంచి ఆకుల లలిత, టీడీపీ నుంచి వేం నరేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున […]

Advertisement
Update:2015-06-01 06:03 IST
తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆరు స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్థులు పోటీచేసిన ఈ ఎన్నిక‌ల్లో 118 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొని త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. వామ‌ప‌క్షాల‌కు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి తుమ్మల, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్‌, యాదవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ నుంచి ఆకుల లలిత, టీడీపీ నుంచి వేం నరేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పొన్నం, శ్రీకాంత్‌, శ్రీపాద శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ తరపున శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్‌, రాజేశ్‌, రాజు, గట్టు రామచంద్రరావు ఏజెంట్లుగా ఉన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని అరెస్ట‌యిన‌ టీటీడీపీ నాయ‌కుడు రేవంత్‌రెడ్డి కూడా న్యాయ‌మూర్తి ల‌క్ష్మీప‌తి అనుమ‌తించ‌డంతో ఓటేసి వెళ్ళారు. ఈ కేసులో ప్ర‌ధాన సాక్షి అయిన స్టీఫెన్‌స‌న్ కూడా ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. మ‌ధ్యాహ్నం స‌మయంలో కేసీఆర్ ఓటు వేసి వెళ్ళారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒకేసారి వ‌చ్చి త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 4 గంటల వరకు పోలింగ్ జ‌రిగింది. మ‌రో గంట‌లో కౌంటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
Tags:    
Advertisement

Similar News