బ్రహ్మోత్సవం మొదలైంది
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా శ్రీమంతుడు టీజర్ ను రిలీజ్ చేయడమే కాకుండా.. ఏకంగా మరో సినిమాను కూడా ప్రారంభించాడు ప్రిన్స్ మహేష్ బాబు. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో బ్రహ్మోత్సవం సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. జులై 10 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల కోసం కాల్షీట్లు కేటాయించాడు మహేష్. పీవీపీ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో తమిళనాట కూడా ఎంట్రీ ఇస్తున్నాడు మహేష్. అవును.. తెలుగు-తమిళ […]
Advertisement
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా శ్రీమంతుడు టీజర్ ను రిలీజ్ చేయడమే కాకుండా.. ఏకంగా మరో సినిమాను కూడా ప్రారంభించాడు ప్రిన్స్ మహేష్ బాబు. శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో బ్రహ్మోత్సవం సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. జులై 10 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల కోసం కాల్షీట్లు కేటాయించాడు మహేష్. పీవీపీ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో తమిళనాట కూడా ఎంట్రీ ఇస్తున్నాడు మహేష్. అవును.. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది బ్రహ్మోత్సవం.
ఎంతోమంది భామల్ని పరిశీలించిన తర్వాత ఫైనల్ గా… బ్రహ్మోత్సవంలో మహేశ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ ను రకుల్ ప్రీత్ సింగ్ ఎగరేసుకుపోయింది. నిజానికి సమంతాను అనుకున్నారు. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. దీంతో రకుల్ కు అనుకోని అవకాశం దక్కింది. సెకెండ్ హీరోయిన్ గా ఎప్పట్లానే ప్రణీతను సెలక్ట్ చేశారు. సత్యరాజ్ ఓ కీలకపాత్రలో కనిపిస్తాడు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తాడు. వచ్చే నెల నుంచి ఏకథాటిగా షూటింగ్ చేసి.. వచ్చే ఏడాది సంక్రాంతికి బ్రహ్మోత్సవాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది పీవీపీ బ్యానర్.
Advertisement