దీపిక బాయ్ ఫ్రెండ్ కు మనసైందట..
తెలివి వుండాలి కానీ .. మీడియాతో ఎలాగైన ఆడుకోవచ్చు. ఈ విషయంలో బాలీవుడ్ హాట్ కపుల్ రణ్వీర్ సింగ్.. దీపిక పదుకోణ్ లు సిద్దహస్తులు. ఇద్దరు క్లోజ్ గా వుంటారు. కలసే వుంటారు. సహజీవనంచేస్తుంటారు. ఇవన్నీ ఓపెన్ గా ఎప్పుడూ చెప్పరు .. మీడియా వాళ్లు ఎంత తెలివిగా ఒత్తిడి చేసినా ఒక్కసారి కూడా నోరు జారలేదు. ఇక దీపిక పదుకోణ్ ఇప్పటి వరకు తన లవ్ ఎఫైర్స్ కు సంబంధించి ఒక్కసారి కూడా మీడియాకు దొరకడం కానీ.. […]
Advertisement
తెలివి వుండాలి కానీ .. మీడియాతో ఎలాగైన ఆడుకోవచ్చు. ఈ విషయంలో బాలీవుడ్ హాట్ కపుల్ రణ్వీర్ సింగ్.. దీపిక పదుకోణ్ లు సిద్దహస్తులు. ఇద్దరు క్లోజ్ గా వుంటారు. కలసే వుంటారు. సహజీవనంచేస్తుంటారు. ఇవన్నీ ఓపెన్ గా ఎప్పుడూ చెప్పరు .. మీడియా వాళ్లు ఎంత తెలివిగా ఒత్తిడి చేసినా ఒక్కసారి కూడా నోరు జారలేదు. ఇక దీపిక పదుకోణ్ ఇప్పటి వరకు తన లవ్ ఎఫైర్స్ కు సంబంధించి ఒక్కసారి కూడా మీడియాకు దొరకడం కానీ.. తను ఫలాన వాళ్లతో ప్రేమలో వున్నాను అని గాని ఏ నాడు చెప్పింది లేదు. ఇక రణ్వీర్ సింగ్ దీపిక పదుకోణ్ ల స్క్రీన్ కెమిస్ట్రి రామ్ లీలాచిత్రంలో పతాక స్థాయిలో వుంటుంది. ఇద్దరి మధ్య ఏదో సంబంధం లేక పోతే అంతటి కెమిస్ట్రి పండటం కష్టమని క్రిటిక్స్ తేల్చారు. దీనికి దీపిక మాత్రం కూల్ గా ..పాత్రల స్వభావని అర్ధం చేసుకుని నటిస్తే కెమిస్ట్రి ఎవరికైన బాగానే పండుతుంది అని సింపల్ గా ఒక ముక్కలో తేల్చింది.
ఇక తాజాగా సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో దీపిక, రణ్వీర్ సింగ్ మరోసారి నటిస్తున్నారు . బాజీరావు మస్తానీ చిత్రం పేరు తో చాల గ్రాండ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈచిత్రంలో కూడా దీపిక , రణ్వీర్ సింగ్ లు లవర్స్ రోల్స్ చేస్తున్నారు. నటుడిగా ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నట్లు చెప్పారు. ఇక పర్సనల్ విషయం ఒకటి తెలిపారు. పెళ్లి చేసుకుని హాయగా కుటుంబంతో జీవించాలనే ఫీలింగ్ కలుగుతుందని చెప్పారు. అయితే ఎవర్ని చేసుకుంటారు. ఆ విషయాలు మాత్రం ఒక్కటికూడా చెప్పలేదు. ఇక తన ఫ్రెండ్ దీపిక నటించి పీకు చిత్రంలో ఆమే నటన చాల బాగుందని మాత్రం చెప్పారు. అంతే తప్ప ..దీపిక తో వున్న సానిహిత్యం గురించి ఒక్క ముక్క చెబితే ఒట్టు మరి.
Advertisement