రాణిరుద్ర‌మ ఎందుకు డిలే అవుతుంది..!

గుణ‌శేఖ‌ర్ త‌న స‌త్తాను  చాటుకోవ‌డానికి   ఎంతో ఘ‌నంగా చేసిన చిత్రం  రాణిరుద్ర‌మ‌. కాక‌తీయుల వీర‌నారి రాణిరుద్ర‌మ జీవిత చ‌రిత్ర‌ను  ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేస్తున్నారు. బ‌డ్జెట్ , టెక్నాల‌జీ  , తారాగ‌ణం ఇలా ఏ విష‌యంలోను కాంప్ర‌మైజ్ కాకుండా  గుణశేఖ‌ర్ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. అలాగే ఆడియో విడుద‌ల కూడా చేశారు కానీ.. సినిమా రిలీజ్ విష‌యం మాత్రం ఇంత వ‌ర‌కు ఒక క్లారీటి లేదు. ప్ర‌స్తుతం  బాహుబ‌లి  మేనియా ప్రారంభం అవుతుంది.  ల‌క్కీగా ఈ సినిమా […]

Advertisement
Update:2015-05-27 10:37 IST

గుణ‌శేఖ‌ర్ త‌న స‌త్తాను చాటుకోవ‌డానికి ఎంతో ఘ‌నంగా చేసిన చిత్రం రాణిరుద్ర‌మ‌. కాక‌తీయుల వీర‌నారి రాణిరుద్ర‌మ జీవిత చ‌రిత్ర‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేస్తున్నారు. బ‌డ్జెట్ , టెక్నాల‌జీ , తారాగ‌ణం ఇలా ఏ విష‌యంలోను కాంప్ర‌మైజ్ కాకుండా గుణశేఖ‌ర్ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. అలాగే ఆడియో విడుద‌ల కూడా చేశారు కానీ.. సినిమా రిలీజ్ విష‌యం మాత్రం ఇంత వ‌ర‌కు ఒక క్లారీటి లేదు. ప్ర‌స్తుతం బాహుబ‌లి మేనియా ప్రారంభం అవుతుంది. ల‌క్కీగా ఈ సినిమా రిలీజ్ కావ‌డానికి ఇంకా 40 రోజులు స‌మ‌యం ఉంది. ఇత‌ర‌త్ర పెద్ద చిత్రాలు కూడా ఈ స‌మ‌యంలో లేవు. బాహుబ‌లి మాదిరి ..రాణిరుద్ర‌మ కూడా ఒక పిరియాడిక్ ఫిల్మ్ .. నిడివి చాల ఎక్కువుగా వుంద‌నే టాక్ ఉంది.

బాహుబ‌లి రిలీజ్ అయిన త‌రువాత రాణిరుద్ర‌మ ను రిలీజ్ చేస్తే.. రిజల్ట్ ఎలా వుంటుందో చెప్ప‌లేం. ఎందుకంటే. బాహుబ‌లి పై భారీ అంచ‌నాలున్నాయి. అన్నింటికి మంచి ప్ర‌పంచం అంత రాజ‌మౌళి ప‌నిత‌నం మీద భారీ న‌మ్మ‌కం పెట్టుకుంది. త‌న పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని ఏ మాత్రం వమ్ము కానివ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌డు . అంటే బాహుబ‌లి ఘ‌న విజ‌యం సాధించే ల‌క్ష‌ణాలు ..అవ‌కాశాలు ఎక్కువుగా వున్నాయ‌న‌డం అతిశ‌యోక్తి కాదు. మ‌రి ఇటువంటి నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ రాణి రుద్ర‌మ చిత్రాని రిలీజ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న ప‌రిస్థితి ఏమి క‌న‌పించ‌డం లేదు.! దీనికి తోడు.. సినిమా నిడివి దాదాపు 3 గంట‌ల‌కు పైగా ఉంద‌నే మాటి వినిపిస్తుంది. ఒక పిరియాడిక్ సినిమాను 2 గంట‌ల‌కు మించి ఈ రోజుల్లో చూడ‌టం క‌ష్ట‌మ‌ని బ‌య్య‌ర్లు చెబుతున్నార‌ట‌. స‌రే నిడివిని త‌గ్గించి రిలీజ్ చేసుకోవ‌చ్చు క‌దా.? అంటే.. స‌రైన బిజినెస్ ప‌ల‌క పోవ‌డం వ‌ల‌నే డిలే జ‌రుగుతున‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్ టాక్!. ఏది ఏమైన బాహుబ‌లి రిలీజ్ కు ముందు రంగంలోకి దింప‌క పోతే రాణిరుద్ర‌మ‌కు క‌ష్టాలే అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    
Advertisement

Similar News