అప్పుడు ఆకలి రాజ్యం.. ఇప్పుడు చీకటి రాజ్యం
లోకనాయకుడు కమల్ హాసన్ చాన్నాళ్ల తర్వాత తెలుగు సినిమా ప్రారంభించాడు. కమల్ నేరుగా ఓ తెలుగుసినిమా చేయడం ఈ మధ్య కాలంలో ఇదే ప్రధమం. కమల్ తాజా చిత్రం పేరు చీకటి రాజ్యం. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో రాజేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కమల్-త్రిష కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు ఇద్దరూ కలిసి మన్మధబాణం అనే రొమాంటిక్ సినిమా చేస్తే.. ఈసారి ఇద్దరూ కలిసి సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ సినిమా […]
Advertisement
లోకనాయకుడు కమల్ హాసన్ చాన్నాళ్ల తర్వాత తెలుగు సినిమా ప్రారంభించాడు. కమల్ నేరుగా ఓ తెలుగుసినిమా చేయడం ఈ మధ్య కాలంలో ఇదే ప్రధమం. కమల్ తాజా చిత్రం పేరు చీకటి రాజ్యం. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో రాజేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కమల్-త్రిష కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు ఇద్దరూ కలిసి మన్మధబాణం అనే రొమాంటిక్ సినిమా చేస్తే.. ఈసారి ఇద్దరూ కలిసి సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కమల్ హైదరాబాద్ లో లాంచ్ చేశాడు. ఇకపై రెగ్యులర్ గా తెలుగులో కూడా సినిమాలు చేస్తానని ప్రకటించాడు కమల్. దాదాపు ఆరేళ్ల పాటు కమల్ హాసన్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా శిష్యరికం చేసిన రాజేష్, చీకటి రాజ్యంతో దర్శకుడిగా ప్రమోషన్ అందుకున్నాడు. రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా చీకటి రాజ్యం అంటుందంటున్నాడు కమల్. అంతకుమించి సినిమాకు సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ రివీల్ చేయలేదు. ఈ సినిమాకు దర్శకుడు మాత్రమే రాజేష్.. కథ-స్క్రీన్ ప్లే వ్యవహారాలన్నీ ఎప్పట్లానే కమల్ హాసన్ చూసుకుంటున్నాడు.
Advertisement