బాహుబలి ఆడియో ప్రసార హక్కులు 50 లక్షలు...!
చెక్కె వాడి మీద నమ్మకం వుంటే ఎటువంటి బండ రాయిని ఇచ్చినా అద్భుతంగా అవుట్ పుట్ వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో జక్కన రేంజ్ అటువంటింది. ఆయన ప్రాజెక్ట్ టేకప్ చేస్తే అవుట్ పుట్ అదరహో అనే రేంజ్ లో వస్తుందని జనాల నమ్మకం. ఒక ప్రాంతీయ భాష చిత్ర పరిశ్రమలో 200 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా చేస్తున్నాడంటే.. నిర్మాతలకు ఆయన పై ఏ స్థాయి నమ్మకం వుందో ఆలోచన చేయాల్సిన సందర్భం ఇది. దాదాపు […]
చెక్కె వాడి మీద నమ్మకం వుంటే ఎటువంటి బండ రాయిని ఇచ్చినా అద్భుతంగా అవుట్ పుట్ వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో జక్కన రేంజ్ అటువంటింది. ఆయన ప్రాజెక్ట్ టేకప్ చేస్తే అవుట్ పుట్ అదరహో అనే రేంజ్ లో వస్తుందని జనాల నమ్మకం. ఒక ప్రాంతీయ భాష చిత్ర పరిశ్రమలో 200 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా చేస్తున్నాడంటే.. నిర్మాతలకు ఆయన పై ఏ స్థాయి నమ్మకం వుందో ఆలోచన చేయాల్సిన సందర్భం ఇది. దాదాపు రెండు సంవత్సరాల పాటు కష్టపడి ప్రభాస్, అనుష్క, రానా తమన్నాలతో చెక్కిన బాహుబలి ఆడియో విడుదలకు సిద్దం అయ్యింది.
మరో ఆరు రోజుల్లో ఈ పండగ ఘనంగా హైదరాబాద్ లో జరగనుంది. అయితే విశేషం ఏమిటంటే.. బాహుబలి ఆడియో రిలీజ్ ప్రసార హక్కులు టీవి5 దాదాపు 50 లక్షలు చెల్లించి సొంతంచేసుకుందట. ఇది నిజంగా దక్షిణాది సినిమా చరిత్రలో ఒక రికార్డ్ అనే చెప్పాలి. దీంతో పాటు.. సినిమా ప్రచారం కేవలం టీవి9, ఎన్ టీవి వంటి రెండు ఛానెల్స్ కే ఇవ్వాలని ఒక ప్రొడ్యూసర్ చేస్తున్న ప్రణాళికను రాజమౌళి త్రోసి పుచ్చినట్లు టాక్. ఈ సినిమా ప్రచారం అన్ని ఛానెల్స్ తో చేయడానికే అయిన సుముఖంగా వున్నట్లు ఇంటర్నల్ టాక్. దీంతో మీడియా అంతా రాజమౌళి నిర్ణయం పట్ల చాల సంతోషంగావున్నట్లు సమాచారం.