అంజలి ఛాన్స్ కొట్టేసింది

అంతా అనుకున్నట్టే జరిగింది. బాలయ్య కొత్త సినిమాకు డిక్టేటర్ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. ఈ మేరకు సినిమా యూనిట్ నుంచి ఓ ప్రెస్ నోట్ కూడా విడుదలైంది. బాలయ్య 99వ సినిమా ఈనెల 29న గ్రాండ్ గా ప్రారంభమౌతుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన మెయిన్ హీరోయిన్ గా అంజలిని తీసుకున్నారు. మరో హీరోయిన్ ను బాలీవుడ్ నుంచి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. లక్ష్యం, పాండవులు […]

Advertisement
Update:2015-05-24 04:11 IST
అంతా అనుకున్నట్టే జరిగింది. బాలయ్య కొత్త సినిమాకు డిక్టేటర్ అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు. ఈ మేరకు సినిమా యూనిట్ నుంచి ఓ ప్రెస్ నోట్ కూడా విడుదలైంది. బాలయ్య 99వ సినిమా ఈనెల 29న గ్రాండ్ గా ప్రారంభమౌతుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన మెయిన్ హీరోయిన్ గా అంజలిని తీసుకున్నారు. మరో హీరోయిన్ ను బాలీవుడ్ నుంచి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. లక్ష్యం, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాల్ని తెరకెక్కించిన శ్రీవాస్, బాలయ్య 99వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాకు శ్రీవాస్ సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తుండడం విశేషం. అంటే ఎరోస్ తో పాటు సంయుక్తంగా శ్రీవాస్ కూడా బాలయ్య 99వ సినిమాను నిర్మిస్తాడన్నమాట. ఇక అంజలి విషయానికొస్తే స్టార్ హీరోల సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ ఎట్టకేలకు బాలయ్య లాంటి మాస్ హీరో సరసన నటించే అవకాశం అందుకుంది. ఇప్పటివరకు వెంకీ లాంటి స్టార్ తో మాత్రమే సినిమా చేసిన అంజలికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్.
Tags:    
Advertisement

Similar News