సమానత్వం...ప్రేమలా ఓ ఫీలింగ్!
ప్రపంచం ఎంతో వేగంగా అన్ని రంగాల్లో పరుగులు తీస్తున్నా, మహిళలు అంతే స్థాయిలో ముందుకు వెళ్లకుండా వాళ్ల కాళ్లకు బంధనాలు ఉంటూనే ఉన్నాయి. తాజాగా గూగుల్ సంస్థ, ఇంటర్‌నెట్ ని ఎంత మంది మహిళలు వినియోగిస్తున్నారు అనే విషయంపై సర్వే చేసింది.. అందులో పాల్గొన్న మహిళల్లో చాలామంది ఇంటర్‌నెట్ ముఖ్యమే కానీ ఎక్కువ సమయం నెట్ లో ఉంటే అత్తమామలు ఏమనుకుంటారో అనే భయం ఉందని చెప్పారు. ఉమన్- టెక్నాలజీ పేరుతో సర్వేచేశారు. తమకు నెట్ అవసరం […]
ప్రపంచం ఎంతో వేగంగా అన్ని రంగాల్లో పరుగులు తీస్తున్నా, మహిళలు అంతే స్థాయిలో ముందుకు వెళ్లకుండా వాళ్ల కాళ్లకు బంధనాలు ఉంటూనే ఉన్నాయి. తాజాగా గూగుల్ సంస్థ, ఇంటర్‌నెట్ ని ఎంత మంది మహిళలు వినియోగిస్తున్నారు అనే విషయంపై సర్వే చేసింది.. అందులో పాల్గొన్న మహిళల్లో చాలామంది ఇంటర్‌నెట్ ముఖ్యమే కానీ ఎక్కువ సమయం నెట్ లో ఉంటే అత్తమామలు ఏమనుకుంటారో అనే భయం ఉందని చెప్పారు. ఉమన్- టెక్నాలజీ పేరుతో సర్వేచేశారు. తమకు నెట్ అవసరం ఉన్నా ఇంటి పనులు పూర్తయిన తరువాత అందుకు చాలా తక్కువ సమయం మిగులుతోందని మరికొందరు చెప్పారు. మహిళలకు నెట్ అందుబాటులోకి రాకపోవడానికి కారణాల్లో ముఖ్యమైనవి వారికి ఆ మాత్రం తమదైన ఏకాంతం దొరకటం లేదు. అలాగే నెట్‌ని వినియోగించాలంటే ఛార్జీలు సైతం వారికి ఎక్కువగానే అనిపిస్తున్నాయి. తక్కువ ఆదాయం గల మగవారికి నెట్ వాడే అవకాశాలు ఉన్నంతగా, తక్కువ ఆదాయం గల ఆడవారికి ఆ అవకాశాలు ఉండటం లేదు. నెట్ అసలు వినియోగించని మహిళల్లో ఎక్కువమంది పెళ్లయి పిల్లలున్నవారే. చిన్నవయసు వారు, చదువుకుంటున్నవారు, కుటుంబ బాదరబందీ లేని ఆడవారు మాత్రమే నెట్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
అయితే చాలామంది ఆడవాళ్లు నెట్ వినియోగం పట్ల ఆసక్తితో ఉన్నారు. 32 శాతంమంది త్వరలో తాము ఇంటర్‌నెట్ వాడకం మొదలుపెడతామని చెప్పారు. 18-29 మధ్య వయసున్న నెట్ వాడని మహిళల్లో 46 శాతం మంది అత్యంత త్వరలో తాము నెట్ ని వినియోగిస్తామని చెప్పారు.
మొత్తంగా, గూగుల్ నిర్వహించిన ఈ సర్వేలో భారత్‌లో నెట్ వినియోగదారుల్లో కేవలం మూడోవంతు మాత్రమే మహిళలు ఉన్నారని తేలింది. 49శాతం మంది అసలు తమకు ఇంటర్‌నెట్ అందుబాటులోకి వచ్చే మార్గమే లేదని చెప్పారు.
గూగుల్ మహిళలను నెట్ వరకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తమ తల్లులకు యువతరమే సహకరించాలంటూ వారిలో స్ఫూర్తిని నింపేలా ఒక చిత్రాన్ని తయారు చేసింది. చాలా ఇళ్లలో ఇంటర్ నెట్ సదుపాయం ఉన్నా గృహిణులు ఆసక్తిని చూపటం లేదు. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నవారిలోనూ ఈ నిరాసక్తత ఉంది. ఆడవారిలో ఈ నిరాసక్తతని పోగొట్టి నెట్ వినియోగదారులుగా మార్చాలని యువతరానికి చెబుతున్నామని గూగుల్ ఇండియా కంట్రీ మార్కెటింగ్ హెడ్ సందీప్ మీనన్ అంటున్నారు. ఆడవాళ్లకి ఇవన్నీ అవసరమా…అనే మాట మన సమాజంలో ఇంకా చాలా సందర్భాల్లో వినబడుతూనే ఉంది. అయితే ఇందులో కొంత బాధ్యత మహిళలకూ ఉంది. ఇంకేం నేర్చుకుంటాములే…అనే ధోరణి పోవాలి. సమానత్వం ఒక్కోసారి ప్రేమలా ఒక ఫీలింగ్ కూడా. దాన్ని ఫీల్ కాకపోతే అసమానతలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది మరి.