బల్లాలదేవ వస్తున్నాడు కాచుకో..

రాజమౌళి సినిమాల్లో విలన్ ఎంత బలంగా ఉంటాడో మనందరికీ తెలిసిందే. అంతటి బలవంతుడైన విలన్ ను హీరో తన తెలివితేటలతో, బుద్ధిబలంతో మట్టికరిపిస్తుంటాడు. రాజమౌళి తీసిన దాదాపు అన్ని సినిమాల్లో ఇదే ఫార్ములా మనం చూశాం. ఇప్పుడు బాహుబలిలో కూడా అదే చూడబోతున్నాం. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న రానా ఫస్ట్ లుక్ ను రాజమౌళి విడుదలచేశాడు. సినిమాలో రానా పాత్ర పేరు బల్లాలదేవ. వెరీ పవర్ ఫుల్ అండ్ ఎనర్జిటిక్ యాంటీహీరో అన్నమాట. పోస్టర్ […]

Advertisement
Update:2015-05-21 05:02 IST
రాజమౌళి సినిమాల్లో విలన్ ఎంత బలంగా ఉంటాడో మనందరికీ తెలిసిందే. అంతటి బలవంతుడైన విలన్ ను హీరో తన తెలివితేటలతో, బుద్ధిబలంతో మట్టికరిపిస్తుంటాడు. రాజమౌళి తీసిన దాదాపు అన్ని సినిమాల్లో ఇదే ఫార్ములా మనం చూశాం. ఇప్పుడు బాహుబలిలో కూడా అదే చూడబోతున్నాం. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న రానా ఫస్ట్ లుక్ ను రాజమౌళి విడుదలచేశాడు. సినిమాలో రానా పాత్ర పేరు బల్లాలదేవ. వెరీ పవర్ ఫుల్ అండ్ ఎనర్జిటిక్ యాంటీహీరో అన్నమాట. పోస్టర్ ను రిలీజ్ చేసిన రాజమౌళి.. బల్లాలదేవ ఛాయల్ని ట్వీట్ చేశాడు. ఎదురులేని శక్తి, ఊహించని ఎత్తుగడలు, అసమాన బలం బల్లాలదేవ సొంతమన్నాడు రాజమౌళి. అయితే బాహుబలి తన బుద్ధిబలంతో బల్లాలదేవను ఓడిస్తాడనేే విషయం రాజమౌళి పాత సినిమాలు చూసినవాళ్లకు ఎవరికైనా అర్థమైపోతుంది. ఇక బాహుబలి సినిమాకు సంబంధించి మిగిలిన ఒకేఒక్క పోస్టర్ ప్రభాస్ ది. ఈ పోస్టర్ కోసం యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పోస్టర్ విడుదల పూర్తయిన వెంటనే.. సినిమా ఆడియో ఫంక్షన్ తేదీని, ట్రయిలర్ లాంచ్ తేదీని అఫీషియల్ గా ప్రకటిస్తాడు బాహుబలి. ఆడియో ఫంక్షన్ అయిపోయిన తర్వాత సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాడు. ఇలా ఓ పద్దతి ప్రకారం ప్రచారం చేసుకుంటూ వస్తున్నాడు జక్కన్న.
Tags:    
Advertisement

Similar News