మరో రీమేక్ పై కన్నేసిన సూపర్ స్టార్
ఫ్లాపుల్లో ఉన్నప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆదుకున్నది రీమేక్ సినిమానే. వరుసగా ఫ్లాపులొచ్చిన టైమ్ లో చంద్రముఖితో బౌన్స్ బ్యాక్ అయ్యారు రజనీ. అదొక రీమేక్ సినిమా. ఇప్పుడు కూడా ఆయన ఫ్లాపుల్లో ఉన్నారు విక్రమసింహ, లింగ సినిమాలు రెండూ ఫ్లాపులయ్యాయి. దీంతో మరోసారి రీమేక్ సినిమాలపై కన్నేశారు సూపర్ స్టార్. కుదిరితే ఓ మలయాళ సినిమాను తమిళ్ లోకి రీమేక్ చేయాలనుకుంటున్నారు. మలయాళంలో హిట్టయిన బాస్ భాస్కర్ – ది రాస్కెల్ అనే సినిమాని […]
Advertisement
ఫ్లాపుల్లో ఉన్నప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆదుకున్నది రీమేక్ సినిమానే. వరుసగా ఫ్లాపులొచ్చిన టైమ్ లో చంద్రముఖితో బౌన్స్ బ్యాక్ అయ్యారు రజనీ. అదొక రీమేక్ సినిమా. ఇప్పుడు కూడా ఆయన ఫ్లాపుల్లో ఉన్నారు విక్రమసింహ, లింగ సినిమాలు రెండూ ఫ్లాపులయ్యాయి. దీంతో మరోసారి రీమేక్ సినిమాలపై కన్నేశారు సూపర్ స్టార్. కుదిరితే ఓ మలయాళ సినిమాను తమిళ్ లోకి రీమేక్ చేయాలనుకుంటున్నారు. మలయాళంలో హిట్టయిన బాస్ భాస్కర్ – ది రాస్కెల్ అనే సినిమాని తాజాగా చూశారు రజనీకాంత్. మమ్ముట్టి-నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రజనీకాంత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. కుదిరితే ఈ సినిమా రీమేక్ లో నటించాలనుకుంటున్నారు సూపర్ స్టార్. ప్రస్తుతం రంజిత్ డైరక్షన్ లో ఓ మూవీ చేస్తున్నారు రజనీకాంత్. 45 రోజుల్లో ఈ సినిమాని పూర్తిచేసి, మలయాళీ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు సూపర్ స్టార్.
Advertisement