ఏపీ టెన్త్‌లో 91.42 శాతం ఉత్తీర్ణత
పదో తరగతి పరీక్షల్లో 91.42 శాతం ఉత్తీర్ణతతో ఆంధ్రప్రదేశ్ రికార్డు నమోదు చేసిందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల సాధనలో ఎప్పటి మాదిరిగానే బాలికలు పై చేయిగా ఉన్నారు. అయితే బాలురు కూడా దాదాపు ఒకే స్థాయిలో ఉన్నారని ఆయన చెప్పారు. బాలికలు 91.71 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 91.51 శాతం దక్కించుకున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 98.54 శాతం ఉత్తీర్ణతతో కడప […]
Advertisement
పదో తరగతి పరీక్షల్లో 91.42 శాతం ఉత్తీర్ణతతో ఆంధ్రప్రదేశ్ రికార్డు నమోదు చేసిందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల సాధనలో ఎప్పటి మాదిరిగానే బాలికలు పై చేయిగా ఉన్నారు. అయితే బాలురు కూడా దాదాపు ఒకే స్థాయిలో ఉన్నారని ఆయన చెప్పారు. బాలికలు 91.71 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 91.51 శాతం దక్కించుకున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 98.54 శాతం ఉత్తీర్ణతతో కడప ప్రథమ స్థానంలో ఉండగా 71.19 శాతంతో చిత్తూరు జిల్లా ఆఖరి స్థానంలో ఉందని ఆయన తెలిపారు. మొత్తం ఆరున్నర లక్షల మంది విద్యార్థలు పరీక్ష రాసినట్టు పేర్కొన్నారు. 3645 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత ఉందని, రెండు పాఠశాలల్లో మాత్రం అసలు ఒక్కరు కూడా ఉత్తీర్ణులు కాలేదని గంటా తెలిపారు. ప్రయివేటు పాఠశాలల్లో 96.62 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 85.09 శాతం మంది పాసయ్యారని ఆయన అన్నారు. హిందీ, సోషల్‌లో 99 శాతం, ఇంగ్లీషు, తెలుగుల్లో 98 శాతం, సైన్స్‌లో 96 శాతం, గణితంలో 94 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి వివరించారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలు సాధించిన ఫలితాలు ఎంతో భేషుగ్గా ఉన్నాయని గంటా తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో వంద శాతం ఫలితాల సాధన లక్ష్యంగా పెట్టుకుని పాఠశాలలు పని చేస్తాయని ఆయన అన్నారు.
Advertisement