రకుల్ కు అలా కలిసొస్తున్నాయట..!
ఏ హీరోయిన్ కెరీర్ అయిన డిసైడ్ చేసేది అడియన్సే అని చెప్పాలి. ఎందుకంటే .. కొత్త హీరోయిన్స్ వాళ్లకు నచ్చితే బ్రహ్మరధం పడతారు. లేక పోతే ఒకటి రెండు చిత్రాలు తరవాత పక్కన బెట్టేస్తారు. ఇక సమంత మాదిరి నటించిన తొలి సినిమాతోనే ఆకట్టుకుంటే.. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ చేస్తారు. హీరోయిన్ గా పరిచయం అవుతున్న వాళ్లు అందరు అందంగానే వుంటారు. కానీ.. యూత్ ఆడియన్స్ కు నచ్చాలంటే వాళ్లకు కొన్ని లెక్కలుంటాయి. ఫ్రెష్ […]
ఏ హీరోయిన్ కెరీర్ అయిన డిసైడ్ చేసేది అడియన్సే అని చెప్పాలి. ఎందుకంటే .. కొత్త హీరోయిన్స్ వాళ్లకు నచ్చితే బ్రహ్మరధం పడతారు. లేక పోతే ఒకటి రెండు చిత్రాలు తరవాత పక్కన బెట్టేస్తారు. ఇక సమంత మాదిరి నటించిన తొలి సినిమాతోనే ఆకట్టుకుంటే.. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ చేస్తారు. హీరోయిన్ గా పరిచయం అవుతున్న వాళ్లు అందరు అందంగానే వుంటారు. కానీ.. యూత్ ఆడియన్స్ కు నచ్చాలంటే వాళ్లకు కొన్ని లెక్కలుంటాయి. ఫ్రెష్ లుక్ ఉండాలి. మీడియమ్ పర్సనాలిటి తో పాటు హాట్ లుక్ కంపల్సరీ .. ఈ లక్షణాలుంటే రెండు మూడు చిత్రాలతో డ్రీమ్ గాళ్ ఇమేజ్ సొంతం చేసుకున్నట్లే. సమంత ఇలా సక్సెస్ అయిన హీరోయినే .
తాజాగా సమంత ప్లేస్ ను రకుల్ ప్రీతిసింగ్ కబ్జా చేసేసింది. గత యేడాది సమంతకు వరసగా ఫెయిల్యూర్ పడటంతో సమంతను తెలుగులో పక్కన పెట్టేస్తున్నారు. రకుల్ ప్రీతిసింగ్ కు మంచి హిట్స్ పడటంతో.. కుర్ర అభిమానులు అంతా ఈ హాట్ బ్యూటీ పేరు జపం చేస్తున్నారు. అందుకే యంగ్ హీరోలంత తమ చిత్రాల్లో రకుల్ ప్రీతిసింగ్ ను హీరోయిన్ గా తీసుకుకోవడానికి పోటి పడుతున్నారు. ఏమిటో టైమ్ ఇలా కలిసొస్తుందని చెబుతుంది రకుల్. అంతే యూత్ ఆడియన్స్ నచ్చినంత కాలం తన కెరీర్ కు ఢోకా లేదు కదా..!