రజనీకాంత్ సరసన నయనతార
సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ఛాన్స్ రావడమంటే మాటలు కాదు. అలాంటి అరుదైన అవకాశాన్ని వరుసగా మూడోసారి దక్కించుకుంది అందాల భామ నయనతార. ఇప్పటికే చంద్రముఖి, కథానాయకుడు సినిమాల్లో సూపర్ స్టార్ సరసన మెరిసిన నయన్, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రజనీకాంత్ పక్కన కనిపించే అదృష్టాన్ని దక్కించుకుంది. త్వరలోనే రంజిన్ అనే దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు రజనీకాంత్. ఈ సినిమాలో నయనతారను హీరోయిన్ గా తీసుకున్నారు. నిజానికి 2 కోట్ల రూపాయలు ఇస్తే తప్ప […]
Advertisement
సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ఛాన్స్ రావడమంటే మాటలు కాదు. అలాంటి అరుదైన అవకాశాన్ని వరుసగా మూడోసారి దక్కించుకుంది అందాల భామ నయనతార. ఇప్పటికే చంద్రముఖి, కథానాయకుడు సినిమాల్లో సూపర్ స్టార్ సరసన మెరిసిన నయన్, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రజనీకాంత్ పక్కన కనిపించే అదృష్టాన్ని దక్కించుకుంది. త్వరలోనే రంజిన్ అనే దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు రజనీకాంత్. ఈ సినిమాలో నయనతారను హీరోయిన్ గా తీసుకున్నారు. నిజానికి 2 కోట్ల రూపాయలు ఇస్తే తప్ప కాల్షీట్లు ఇవ్వనని నయనతార మొండికేసి కూర్చుంది. ఉన్నంతలో డబ్బు సంపాదించుకొని ఫేడవుట్ అయిపోదామని చూస్తోంది. కాకపోతే రజనీ సరసన మూవీ కావడంతో పారితోషికాన్ని కాస్త తగ్గించుకుందని సమాచారం. ఎరోస్ ఇంటర్నేషనల్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. గతంలో వచ్చిన నష్టాల్ని భర్తీ చేసుకునేందుకు ఎరోస్ సంస్థకు మరోసారి నిర్మాతగా అవకాశం ఇచ్చాడు రజనీకాంత్.
Advertisement