లయన్ తోక కట్ చేస్తున్నారు

సినిమా రిలీజయ్యాక కత్తెరించడాలు ఎక్కువైపోయాయి ఈమధ్య. లయన్ సినిమాకి కూడా ఇదే జరగబోతోంది. అయితే ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఎవరైనా ఫస్ట్ డే రిపోర్ట్ చూసిన తర్వాత కొన్ని సన్నివేశాలు కత్తిరించడానికి సిద్ధమౌతారు. కానీ లయన్ సినిమా వీకెండ్ రన్ పూర్తిచేసుకుంది. ఇప్పుడు కత్తెర్లు వేయడానికి సిద్ధమౌతోంది యూనిట్. ఏకంగా 14 నిమిషాల సీన్లు తీసేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి యూనిట్ పెద్ద సర్వేనే చేసింది. అన్ని జిల్లాల నుంచి అభిమానులతో రిపోర్ట్ తెప్పించుకుంది. సినిమాలో ఏ సీన్లు […]

Advertisement
Update:2015-05-18 05:49 IST
సినిమా రిలీజయ్యాక కత్తెరించడాలు ఎక్కువైపోయాయి ఈమధ్య. లయన్ సినిమాకి కూడా ఇదే జరగబోతోంది. అయితే ఇప్పటికే ఆలస్యమైపోయింది. ఎవరైనా ఫస్ట్ డే రిపోర్ట్ చూసిన తర్వాత కొన్ని సన్నివేశాలు కత్తిరించడానికి సిద్ధమౌతారు. కానీ లయన్ సినిమా వీకెండ్ రన్ పూర్తిచేసుకుంది. ఇప్పుడు కత్తెర్లు వేయడానికి సిద్ధమౌతోంది యూనిట్. ఏకంగా 14 నిమిషాల సీన్లు తీసేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి యూనిట్ పెద్ద సర్వేనే చేసింది. అన్ని జిల్లాల నుంచి అభిమానులతో రిపోర్ట్ తెప్పించుకుంది. సినిమాలో ఏ సీన్లు బాగా పండలేదో లిస్ట్ తయారుచేసింది. వాటిలోంచి మెజారిటీ నెగెటివ్ మార్కులు పడిన సీన్లను ఫిల్టర్ చేసి కత్తిరింపులకు రంగం సిద్ధం చేసింది. ఈ కత్తిరించే సీన్లను మరోసారి బాలయ్యకు చూపించి, అతడు ఓకే అంటే అప్పుడు కత్తిరించాలనుకుంటోంది. ఈలోగా సినిమాకు మరింత నెగెటివ్ టాక్ వస్తుందేమో..
Tags:    
Advertisement

Similar News