ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది: అరుణ్ జైట్లీ

ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయి కంటే వేగంగా పుంజుకుంటోంద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు సైతం గాడిలో పడ్డాయన్నారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న నిరాశ, నిస్పృహలు తొలగి పోతున్నాయన్నారు. అధికారం చేపట్టి ఏడాది పూర్తయినందున ఇక సాగు నీరు, సామాజిక పథకాల వంటి గ్రామీణ మౌలిక సదుపాయలపై దృష్టి పెడతామన్నారు. ద్రవ్యోల్బణం ఐదు శాతం దిగువకు వచ్చినందున అందరిలానే తానూ ఆర్‌బిఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని ఆశిస్తున్నట్టు ఆర్థిక […]

Advertisement
Update:2015-05-15 02:56 IST
ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయి కంటే వేగంగా పుంజుకుంటోంద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు సైతం గాడిలో పడ్డాయన్నారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న నిరాశ, నిస్పృహలు తొలగి పోతున్నాయన్నారు. అధికారం చేపట్టి ఏడాది పూర్తయినందున ఇక సాగు నీరు, సామాజిక పథకాల వంటి గ్రామీణ మౌలిక సదుపాయలపై దృష్టి పెడతామన్నారు. ద్రవ్యోల్బణం ఐదు శాతం దిగువకు వచ్చినందున అందరిలానే తానూ ఆర్‌బిఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని ఆశిస్తున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టాక సేవల రంగంతో పాటు మౌలిక సదుపాయాల రంగమూ గాడిలో పడిందన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే కీలకమైన బిల్లులకు సైతం పార్లమెంట్‌ ఆమోదం పొంద గలిగామన్నారు. జిఎస్‌టి బిల్లుపై సైతం చాలా పురోగతి సాధించామని జైట్లీ చెప్పారు.
Tags:    
Advertisement

Similar News