తమన్నా ప్లేస్ కొట్టేసిన కొత్త పాప...

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ కి కొదవే ఉండదు. ఎప్పటికప్పుడు ఎదో ఒక సినిమాతో ఓ కొత్త‌ హీరోయిన్ ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ ఉంటుంది. కాకపోతే కొందరికి అదృష్టం బాగుండి స్టార్ హీరోయిన్ అవుతారు, మరి కొంత మంది అవకాశాలు లేక చిన్న హీరోయిన్స్ గానే ఉండి పోతారు. ఇక తెలుగులో ఇప్పుడిప్పుడే స్టార్ లు అవుతున్న హీరోయిన్స్ ని చుస్తే, రకుల్ ప్రీత్ సింగ్,రెజీనా, రాశి ఖన్నా లు ముందు ఉంటారు. ఇక వీళ్ళల్లో […]

Advertisement
Update:2015-05-13 00:52 IST

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ కి కొదవే ఉండదు. ఎప్పటికప్పుడు ఎదో ఒక సినిమాతో ఓ కొత్త‌ హీరోయిన్ ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ ఉంటుంది. కాకపోతే కొందరికి అదృష్టం బాగుండి స్టార్ హీరోయిన్ అవుతారు, మరి కొంత మంది అవకాశాలు లేక చిన్న హీరోయిన్స్ గానే ఉండి పోతారు. ఇక తెలుగులో ఇప్పుడిప్పుడే స్టార్ లు అవుతున్న హీరోయిన్స్ ని చుస్తే, రకుల్ ప్రీత్ సింగ్,రెజీనా, రాశి ఖన్నా లు ముందు ఉంటారు. ఇక వీళ్ళల్లో రకుల్ ప్రీత్ టాప్ రేంజ్ లో ఉందని చెప్పచ్చు. తాజాగా ఈ లిస్ట్ లో మ‌రో హీరోయిన్ ఎంట్రీ కొట్టడానికి సిద్దంగా ఉంది.

నాగ సౌర్య హీరో గా వస్తున్న ‘జాదు గాడు’ సినిమా లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది సోనారిక. బుల్లి తెర లో చిన్నగా అడుగులు వేస్తున్న ఈ హీరోయిన్ కు ఒక్కసారిగా కమర్షియల్ సినిమాలో ఛాన్స్ త‌గిలింది. . చూడటానికి బంగారు బొమ్మలా ఉన్న ఈమె పైన డైరెక్టర్ల కళ్ళు బాగానే పడినట్లు ఉన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరో గా భీమినేని శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో ఈ సోనారిక నే సెలెక్ట్ చేసుకున్నారట. ముందుగా తమన్నాని అనుకున్నా కాని, ఆమె ప్లేస్ లో ఈ కొత్త బ్యూటీ ని తీసుకున్నారట. ఇంతే కాకుండా, బోయపాటి శ్రీను- అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి కూడా ఈ సోనారికా’ని తీసుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ సినిమాలో ఛాన్స్ వస్తే మాత్రం ఈమె కూడా పెద్ద హీరోయిన్ అయినట్లే..!

Tags:    
Advertisement

Similar News