అలా చేస్తే అభాసు పాలువుతుందని కాజల్ నమ్మకం..!
ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు పోటీ చాలా ఎక్కువ. హీరో కెరీర్ కు ఒక ఎండింగ్ అంటూ ఉండదు కానీ.. హీరోయిన్స్ విషయంలో ఇది పూర్తి భిన్నం. ఒకటి రెండు సంవత్సరాలు సక్సెస్ ఫుల్ గా కెరీర్ గ్రాఫ్ కంటిన్యూ కావడమే చాల గొప్ప విషయం .అటువంటిది పది సంవత్సారాల పాటు బిజీగా ఉండటం అనేది నిజంగా గొప్ప విషయమే. ఈ విషయంలో కాజల్ నిజంగా డిమాండ్ ఉన్న హీరోయినే అనే అంగీకరించాలి. అయితే తన సక్సెస్ కు […]
ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు పోటీ చాలా ఎక్కువ. హీరో కెరీర్ కు ఒక ఎండింగ్ అంటూ ఉండదు కానీ.. హీరోయిన్స్ విషయంలో ఇది పూర్తి భిన్నం. ఒకటి రెండు సంవత్సరాలు సక్సెస్ ఫుల్ గా కెరీర్ గ్రాఫ్ కంటిన్యూ కావడమే చాల గొప్ప విషయం .అటువంటిది పది సంవత్సారాల పాటు బిజీగా ఉండటం అనేది నిజంగా గొప్ప విషయమే. ఈ విషయంలో కాజల్ నిజంగా డిమాండ్ ఉన్న హీరోయినే అనే అంగీకరించాలి. అయితే తన సక్సెస్ కు సెలక్టివ్ గా రోల్స్ చేయడమే కారణమని ఆమె చెప్పింది. తనకు నొప్పని రోల్స్ చేసి వుంటే ఈ పాటికి ఫేడ్ అవుట్ కావడం జరిగేదని తెలిపింది.
చందమామ చిత్రం తను ఆశించిన దానికంటే ఎక్కవ క్రేజ్ నే తెచ్చిందని ఆమె తన సంతోషాన్ని వ్యక్త పరిచింది. సరదగా ఉండే అమ్మాయి రోల్స్.. భావోద్వేగాలు చూపించే రోల్స్ మాత్రమే తనకు బాగా సెట్ అవుతాయని చెప్పింది. రౌడి రాణి , క్రూరమైన విలన్ రోల్స్ తనకు ఏ మాత్రం సెట్ కావని.. కెరీర్ లో తానెప్పటికీ అటువంటి రోల్స్ చేయనని సెలవిచ్చిందీ ముద్దుగుమ్మ. ఇంతకి ఇప్పుడు కాజల్ ఇలా మాట్లాడటంలో ఉన్న పరమార్ధం ఏమిటో దర్శక, నిర్మాతలు అర్ధం చేసుకోవాలా ఏమో..