రామ్ ఈసారైనా పండగ చేసుకుంటాడా?
‘దేవదాసు’తో 2006లో తెలుగుతెరకు పరిచయమైన మరో వారసత్వ హీరో రామ్. తొలిసినిమా భారీ హిట్ సాధించినా తరువాత వచ్చిన ‘జగడం’ నిరాశపరిచింది. తరువాత ‘రెడీ’ హిట్, మస్కా యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. నటన పరంగా రోజురోజుకు పరిణతి సాధిస్తున్నా.. సరైన హిట్ లేకుండా సతమతమవుతున్నాడు. తరువాత వచ్చిన ‘గణేశ్, రామరామ కృష్ణ కృష్ణ ‘బాగా నిరాశపరిచాయి. 2011లో వచ్చిన ‘కందిరీగ’ సినిమా హిట్ సాధించి పెట్టింది. రామ్ ఎనర్జిటక్ నటన ఈ సినిమా హిట్ అవడానికి ఎంతో […]
Advertisement
‘దేవదాసు’తో 2006లో తెలుగుతెరకు పరిచయమైన మరో వారసత్వ హీరో రామ్. తొలిసినిమా భారీ హిట్ సాధించినా తరువాత వచ్చిన ‘జగడం’ నిరాశపరిచింది. తరువాత ‘రెడీ’ హిట్, మస్కా యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. నటన పరంగా రోజురోజుకు పరిణతి సాధిస్తున్నా.. సరైన హిట్ లేకుండా సతమతమవుతున్నాడు. తరువాత వచ్చిన ‘గణేశ్, రామరామ కృష్ణ కృష్ణ ‘బాగా నిరాశపరిచాయి. 2011లో వచ్చిన ‘కందిరీగ’ సినిమా హిట్ సాధించి పెట్టింది. రామ్ ఎనర్జిటక్ నటన ఈ సినిమా హిట్ అవడానికి ఎంతో దోహదపడింది. తరువాత వచ్చిన ‘ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలా సినిమాలు రామ్ కెరీర్‌లో భారీ ప్లాపులుగా నిలిచిపోయాయి. హిట్ సినిమాల హీరోయిన్‌గా పేరొందిన రకుల్ ప్రీత్‌సింగ్‌తో పండగ చేస్కోతో ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పాపం! రామ్ ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా హిట్ కొట్టి పండగ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడట..
Advertisement