రాజకీయాల్లోకి రావడం పెద్ద తప్పు: దాసరి
తాను రాజకీయాల్లోకి వచ్చి జీవితంలో పెద్ద తప్పు చేశానని కేంద్ర మాజీమంత్రి, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు 71వ జన్మదినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ దాసరి నారాయణరావు స్వర్ణకంకణాన్ని ప్రముఖ సినీ దర్శకురాలు విజయనిర్మలకు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లపాటు తెల్లటి వస్త్రాలతో, మనసుతో గౌరవంగా జీవించానన్నారు. అలాంటి తనకు మాయని మచ్చ అంటించారని, అది […]
Advertisement
తాను రాజకీయాల్లోకి వచ్చి జీవితంలో పెద్ద తప్పు చేశానని కేంద్ర మాజీమంత్రి, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు 71వ జన్మదినోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ దాసరి నారాయణరావు స్వర్ణకంకణాన్ని ప్రముఖ సినీ దర్శకురాలు విజయనిర్మలకు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లపాటు తెల్లటి వస్త్రాలతో, మనసుతో గౌరవంగా జీవించానన్నారు. అలాంటి తనకు మాయని మచ్చ అంటించారని, అది కూడా తారుతో అంటించారని వాపోయారు. ఎప్పటికైనా తాను కడిగిన ఆణిముత్యంలా బయటికి వస్తానన్నారు. కార్యక్రమంలో జయసుధ పాల్గొన్నారు.
Advertisement