ఎట్టకేలకు కుండ బద్దలు కొట్టారు..!
బాలీవుడ్ కాసనోవ రణభీర్ కపూర్, హాట్ బ్యూటీ కత్రీనా కైఫ్ ల ప్రేమయాణం తెలియని సినిమా ప్రేక్షకుడు ఉండరు. అయితే వీరు మాత్రం తమ లవ్ ఎఫైర్ గురించి ఇంత వరకు ఎక్కడ మీడియాలో ఓపెన్ గా చెప్పలేదు. వీరు కలసి నటించిన అజబ్ ప్రేమ్ కి ఘజబ్ కహానీ చిత్రం నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగారు. గత యేడాది ఒక బీచ్ లో కత్రీనా, రణబీర్ లు కలసి స్నానాలు చేస్తున్న పిక్చర్స్ […]
Advertisement
బాలీవుడ్ కాసనోవ రణభీర్ కపూర్, హాట్ బ్యూటీ కత్రీనా కైఫ్ ల ప్రేమయాణం తెలియని సినిమా ప్రేక్షకుడు ఉండరు. అయితే వీరు మాత్రం తమ లవ్ ఎఫైర్ గురించి ఇంత వరకు ఎక్కడ మీడియాలో ఓపెన్ గా చెప్పలేదు. వీరు కలసి నటించిన అజబ్ ప్రేమ్ కి ఘజబ్ కహానీ చిత్రం నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగారు. గత యేడాది ఒక బీచ్ లో కత్రీనా, రణబీర్ లు కలసి స్నానాలు చేస్తున్న పిక్చర్స్ మీడియాకు లీక్ కావడంతో.. కత్రీనా, రణబీర్ ల మధ్య బంధం ఫెవికిక్ అంత క్లోజ్ అనేది తెలిసింది.
అయినప్పటీకి వారు మీడియాకు ఓపెన్ కాలేదు. కట్ చేస్తే ఈ మధ్య రణబీర్ కపూర్ ఫ్యామిలీ లో జరిగిన ఒక విందుకు కత్రీనా అటెండ్ కావడంతో ఇక వీరిద్దరి పెళ్లి ఖాయమనే క్లారీటికి వచ్చారు బాలీవుడ్ జనాలు. నిజంగానే రణబీర్ కపూర్ ఇక మీడియాకు తమ ప్రేమయాణం దాచి ప్రయోజనం లేదనుకున్నట్లున్నారు. రణబీర్, కత్రీనా లు వచ్చే యేడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు రణబీర్ ప్రకటించాడు. తనకు ముగ్గురు పిల్లలు కావాలని కూడా చెప్పిన విషయం తెలిసిందే. పెళ్లికి కత్రీనా సుముఖంగా ఉంది మరి. ప్రస్తుతం ఇద్దరు కలసి ఒక చిత్రం చేస్తున్నారు, మొత్తం మీద ఇక తమ పై పుకార్ల కు ఛాన్స్ లేకుండా చేశారు రణబీర్.
Advertisement