ఈ వారం బాక్సాఫీస్ రిపోర్ట్
పెద్ద పెద్ద సినిమాలతో ఈ సమ్మర్ కి కళకళలాడుతుందనుకున్న బాక్సాఫీస్ పూర్తిగా డీలా పడింది. సన్ ఆఫ్ సత్య మూర్తి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు హిట్ గా నిలబడ్డా బయ్యర్లకి మాత్రం లాభాలను అందించలేకపోయింది. గంగ సినిమా ఒక్కటే డబ్బులు కళ్ళ చూస్తుంది. ఓ.కే.బంగారం ఓ.కే. తప్పితే ప్రాఫిటబుల్ వెంచర్ కాదు. దోచేయ్ , ఉత్తమ విలన్ మొదలయినవి ఫ్లాప్స్ కిందే లెక్క. ఇక ఈ వారం విషయానికొస్తే – దొంగాట బాగుందని టాక్ […]
Advertisement
పెద్ద పెద్ద సినిమాలతో ఈ సమ్మర్ కి కళకళలాడుతుందనుకున్న బాక్సాఫీస్ పూర్తిగా డీలా పడింది. సన్ ఆఫ్ సత్య మూర్తి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు హిట్ గా నిలబడ్డా బయ్యర్లకి మాత్రం లాభాలను అందించలేకపోయింది. గంగ సినిమా ఒక్కటే డబ్బులు కళ్ళ చూస్తుంది. ఓ.కే.బంగారం ఓ.కే. తప్పితే ప్రాఫిటబుల్ వెంచర్ కాదు. దోచేయ్ , ఉత్తమ విలన్ మొదలయినవి ఫ్లాప్స్ కిందే లెక్క. ఇక ఈ వారం విషయానికొస్తే – దొంగాట బాగుందని టాక్ తెచ్చుకున్నా ఎంత మేరకు నిలబడుతుందో వేచి చూడాల్సిందే. ఇర్వింగ్ వాలెస్ అనే ఇంగ్లీష్ రైటర్ ఎప్పుడో రాసిన ఫాన్ క్లబ్ అనే నవలలో సినిమా హీరోయిన్ని కిడ్నాప్ చేయడం ప్రధాన ఇతివృత్తం. ఆ నవల ఆధారంగా చాలా కాలం క్రితం సిల్క్ స్మిత హీరోయిన్ గా పారిపోయిన ఖైదీలు అనే సినిమా వచ్చింది. ఈ ఛాయలు కనబడ్డా బాగా ఎంటర్టైనింగ్ గా నడిచి చ బయటపడొంది దొంగాట. శాటిలైట్ రైట్స్ తో ఈ సినిమా సేఫ్ గా బయటపడే అవకాశం ఉంది. మౌత్ టాక్ పెరిగితే లాభాలు కూడా చవి చూడొచ్చు. దాగుడు మూతలు దండాకోర్ సినిమా 9 న విడుదలయింది. ఇది ఫీల్ గుడ్ సినిమా అయినా ప్రేక్షకులు ధియేటర్లలో ఎంత మేరకు చూస్తారనేది అనుమానమే. పెట్టుబడి తక్కువ అయినప్పటికి, వెనక ఎంత మంది హేమా హేమీలున్నా సేఫ్ జోన్ లోకి చేరడం కష్టమన్పిస్తుంది.
Advertisement