విమానంలో చైతూ... శృతీ సెల్ఫీ!

సినిమా ఇండస్ట్రీ లో ఉంటే రూమర్స్ గురించి పెద్దగా ఆలోచించకూడదు. ఈ విషయం దాదాపు అందరి హీరో, హీరోయిన్స్ కు అర్థం అయ్యే ఉంటుంది. ఒక రూమర్ వచ్చిందంటే అది చివరికి ఒక క్లారిటీ వచ్చే వరకు ఎవరికీ నిద్ర పట్టదు. అందుకే ఎప్పుడు ఏ విషయం బయటకి వస్తుందా అని సెలబ్రిటీస్ బయపడుతూ ఉంటారు. ఇక పర్సనల్ విషయాలు, అలాగే రిలేషన్ షిప్ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ మ‌ధ్య  సెలబ్రిటీస్  సోష‌ల్ […]

Advertisement
Update:2015-05-09 14:30 IST
సినిమా ఇండస్ట్రీ లో ఉంటే రూమర్స్ గురించి పెద్దగా ఆలోచించకూడదు. ఈ విషయం దాదాపు అందరి హీరో, హీరోయిన్స్ కు అర్థం అయ్యే ఉంటుంది. ఒక రూమర్ వచ్చిందంటే అది చివరికి ఒక క్లారిటీ వచ్చే వరకు ఎవరికీ నిద్ర పట్టదు. అందుకే ఎప్పుడు ఏ విషయం బయటకి వస్తుందా అని సెలబ్రిటీస్ బయపడుతూ ఉంటారు. ఇక పర్సనల్ విషయాలు, అలాగే రిలేషన్ షిప్ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ మ‌ధ్య సెలబ్రిటీస్ సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో పెట్టే పోస్ట్ లు, ఫోటో లు చూసుకొని మరీ పెడుతున్నారు . కాని ఒక కొత్త రూమర్ ఒకటి శ్రుతి హాసన్ పై హాల్ చల్ చేస్తుంది.
ఆ మద్య ఐపిఎల్ మ్యాచ్ లు జరుగుతుండగా క్రికెటర్ సురేష్ రైనా తో శ్రుతి హాసన్ కి లవ్ అఫైర్ అనే విషయం బాగా పాపులర్ అయ్యింది. కాని ఆ విషయం పై వీరిద్దరూ ఒక క్లారిటీ ఇవ్వడంతో అది అక్కడితో ఆగిపోయింది. కాని ఇప్పుడు శ్రుతీ, నాగ్ చైతన్య తో రిలేషన్లో ఉందంటూ తమిళ మీడియా రాసేస్తోంది. కానీ ఈ విషయం తెలుగు మీడియా పట్టించుకోలేదు. కాని రీసెంట్ గా శ్రుతీ హాసన్, నాగ చైతన్య లు ఒక విమానంలో క‌లిసి దిగిన సేల్ఫీ ఒకటి పోస్ట్ చేసారు. ఇక ఈ ఫోటో చూసిన తర్వాత ఇది నిజమే అంటూ మళ్ళీ ప్రచారం మొదలు పెట్టేసారు. కానీ వీరిద్దరి మధ్య మాములు పరిచయం మాత్రమే ఉందని ఒక టాక్. ఇక ఈ విషయం పైన వీరిద్దరు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..!
Tags:    
Advertisement

Similar News