దాగుడు మూత దండాకోర్ మూవీ రివ్యూ

రేటింగ్: 2.75/5  ‘దాగుడుమూతల దండాకోర్’ ఎక్కడ వెతకాలి?” అంటూ వెతికి తమిళంలో హిట్టయిన ఎ.యల్. విజయన్ ‘శైవమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసారు. ఉషాకిరణ్ మూవీస్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని సమర్పించారు. సున్నితమైన కథాంశాలు మన తెలుగు చిత్రాల్లోకి అడపా దడపా తప్పితే తొంగి చూసే చిత్రమే లేదు. ఓ గ్రామీణ కుటుంబపు కేన్వాసు మీద ‘జీవకారుణ్యం’ కలిగేలా కాకుండా ప్రదర్శించేలా చేసిన చిత్రమిది. వేసవి సెలవుల్లో పిల్లల్ని ఈ చిత్రం టార్గెట్ చేసినా – […]

Advertisement
Update:2015-05-09 10:20 IST

రేటింగ్: 2.75/5

‘దాగుడుమూతల దండాకోర్’ ఎక్కడ వెతకాలి?” అంటూ వెతికి తమిళంలో హిట్టయిన ఎ.యల్. విజయన్ ‘శైవమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసారు. ఉషాకిరణ్ మూవీస్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని సమర్పించారు. సున్నితమైన కథాంశాలు మన తెలుగు చిత్రాల్లోకి అడపా దడపా తప్పితే తొంగి చూసే చిత్రమే లేదు. ఓ గ్రామీణ కుటుంబపు కేన్వాసు మీద ‘జీవకారుణ్యం’ కలిగేలా కాకుండా ప్రదర్శించేలా చేసిన చిత్రమిది. వేసవి సెలవుల్లో పిల్లల్ని ఈ చిత్రం టార్గెట్ చేసినా – యిది పిల్లల చిత్రం మాత్రమే కాదు!

రాజు (రాజేంద్రప్రసాద్) గారి మనుమరాలు బంగారం (బేబీ సారా అర్జున్). బంగారానికి నాని (కోడి) అంటే చాలా ఇష్టం. ఊరి జాతరకు కొడుకులూ కోడళ్ళూ మనవలూ వస్తారు. బిజినెస్ లో రాణించకపోవడం, పిల్లలు కలుగక పోవడం, అప్పులూ అవస్తలూ యిలా ఏవేవో సమస్యలు. పోలేరమ్మకు మొక్కు చెల్లించకపోవడమే కారణమని యింటిల్లిపాదీ భావిస్తారు. నానిని బలి యివ్వాలని మొక్కేస్తారు. అంతే మర్నాటి నుండి నాని కనిపించదు. బంగారమే దాచేస్తుంది. కోడి కోసం కోటి తగువులు పడతారు. కోడినీ కనిపెడతారు. ఇంటి పెద్ద రాజుగారి ముందు బయట పెట్టరు. రాజుగారికి తెలియనే తెలిసింది. తెలిసాక ఏమయింది? బలి యిచ్చారా? కోడిని కాపాడు కావాలన్న బంగారం ఆశ ఫలిచిందా? యిది బర్డ్ ఫ్లూ సమయం.. కోడికి వెక్సినేసన్ ఎవరిస్తారు?

ప్లస్: కథ, అర్థవంతమైన సంగీత సాహిత్యాలు

మైనస్: కథనం, కథలో మెయిన్ పాయింట్ ని రీచ్ కావడానికే 45 నిముషాలు (సినిమాలో సుమారు సగభాగం) పట్టడం.

పెర్ఫార్మెన్సు: రాజేంద్రప్రసాద్, బేబీ సారా, బాలు(ఎర్ర బాబు- పనివాడు) పాత్రల్ని పండించారు. తొలిప్రయత్నంలో దర్శకుడు మలినేని, మాటలు పెద్దింటి పర్వాలేదనిపించారు. ఇయస్ మూర్తి సంగీతం చాలా బావుంది

Tags:    
Advertisement

Similar News