సల్మాన్‌ఖాన్‌కు హైకోర్టులో బెయిల్ మంజూరు
సల్మాన్‌ఖాన్‌కు సాధారణ బెయిల్ మంజూరు చేస్తూ ముంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. ముంబాయి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతోపాటు ముఫ్పై వేల రూపాయలు, పాస్‌పోర్టును డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. మరికొద్ది సేపట్లో సల్మాన్ హైకోర్టుకు హాజరై లాంఛనాలను పూర్తి చేయనున్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.ఈ కేసులో సల్మాన్‌ఖాన్ తరఫున అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఆయన వాదనలు సమర్థవంతంగా ఉండడంతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారని సల్మాన్ కుటుంబసభ్యులు […]
Advertisement
సల్మాన్‌ఖాన్‌కు సాధారణ బెయిల్ మంజూరు చేస్తూ ముంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. ముంబాయి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది. వ్యక్తిగత పూచీకత్తుతోపాటు ముఫ్పై వేల రూపాయలు, పాస్‌పోర్టును డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. మరికొద్ది సేపట్లో సల్మాన్ హైకోర్టుకు హాజరై లాంఛనాలను పూర్తి చేయనున్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.ఈ కేసులో సల్మాన్‌ఖాన్ తరఫున అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఆయన వాదనలు సమర్థవంతంగా ఉండడంతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారని సల్మాన్ కుటుంబసభ్యులు అన్నారు. అయితే కోర్టులో కేసు విచారణ ఉందని తెలిసినా సల్మాన్ హైకోర్టు చాయలకు రాలేదు. బెయిల్ కోసం కొత్త పూచీకత్తులు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కింది కోర్టులో విచారణ సరిగా జరగలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Advertisement