మంచు లక్ష్మి కి ఇప్పటికి తెలిసి వచ్చింది..

సినిమా ప్రపంచం అంటేనే ఒక మాయా ప్రపంచం అని అంటారు. ఇక్కడ ఎవరు ఎలా బ్రతుకుతారో వాళ్ళకే తెలియదు. సినిమాల లోకి వచ్చి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఉన్న డబ్బులు అన్నింటిని పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఇలా ఏం జరిగినా కాని సినిమా అనే పిచ్చి ని మాత్రం వదులుకోలేరు ఎవరూ. ఎప్పటికైనా పోయిన డబ్బుని మళ్ళీ  సంపాదించాలనే పట్టుదలతో మరికొంత మంది ముందుకు వెళ్తూ ఉంటారు.  ఇలాంటి వాటిలో మంచు ఫ్యామిలీ గురించి […]

Advertisement
Update:2015-05-07 08:28 IST

సినిమా ప్రపంచం అంటేనే ఒక మాయా ప్రపంచం అని అంటారు. ఇక్కడ ఎవరు ఎలా బ్రతుకుతారో వాళ్ళకే తెలియదు. సినిమాల లోకి వచ్చి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఉన్న డబ్బులు అన్నింటిని పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఇలా ఏం జరిగినా కాని సినిమా అనే పిచ్చి ని మాత్రం వదులుకోలేరు ఎవరూ. ఎప్పటికైనా పోయిన డబ్బుని మళ్ళీ సంపాదించాలనే పట్టుదలతో మరికొంత మంది ముందుకు వెళ్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో మంచు ఫ్యామిలీ గురించి మాట్లాడుకోక తప్పదు.

గత కొంత కాలంగా మంచు ఫ్యామిలీ వాళ్ళు సినిమాల పైన ఎంత ఖర్చు పెట్టారు అనే దాని కంటే ఆ సినిమాల పైన ఎంత నష్టపోయారు అనేది అందరికి తెలుసు. ఒక దశలో తీసిన ప్రతి సినిమా నష్టాన్ని మిగిల్చిందే. అందుకే మంచు మనోజ్, విష్ణు లు ఇద్దరూ ట్రాక్ మార్చి కామెడీ జోన్ ని నమ్ముకొని వరుస విజయాలు సాధించి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మంచు లక్ష్మి మాత్రం ఇంకా సెట్ అవలేదు. మంచి సినిమాలు తీసి అవార్డులు సాధిస్తున్నా కాని, సినిమాకు లాభాలు మాత్రం రావడం లేదని వాపోయింది. అనుభ‌వం నేర్పిన పాఠం అన్న‌ట్లు…’రూపాయి ఉందని ఖర్చు పెట్టకూడదు, మన మార్కెట్ను బట్టి సినిమాను నిర్మించాలి’ అంటూ ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో గుండెల్లో గోదారి.. ఊ కొడ‌తారా ఉలిక్కి ప‌డ‌తారా చిత్రాలు మంచి ఫీడ్ బాక్ ఇచ్చిన‌ట్లున్నాయి అంటున్నారు పరిశీలకులు. ఇక తాజాగా త‌న బ్యాన‌ర్ లో వ‌స్తున్న దొంగాట చిత్రం వ్యాపార ప‌రంగా త‌న జేబు బాగా నింపుతుంద‌ని ఆశిస్తుంది మ‌రి.! త‌న ఆశ నిజం కావాల‌ని కోరుకుందాం.

Tags:    
Advertisement

Similar News